జాతీయ వార్తలు

చర్చకు భయపడుతున్న మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 25: పెద్దనోట్ల రద్దుపై పార్లమెంటు హాజరుకావడానికి ప్రధాని మోదీ ఎందుకు భయపడుతున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. ఒక్క పక్క పార్లమెంటు ఉభయ సభలూ ఈ అంశంపై అట్టుడికి పోతుంతే మోదీ హాజరుకాకపోవడం అనేక అనుమానాలు తావిస్తోందని అన్నారు. దమ్ముంటే పార్లమెంటుకు హాజరై ప్రతిపక్షాలు అడిగే ప్రతి ప్రశ్నకు మోదీ సమాధానం ఇవ్వాలని ఆయన సవాల్ విసిరారు. నోట్ల రద్దు అనంతరం మోదీ వ్యవహరించిన తీరు విడ్డూరంగా ఉందని ఓ పక్క ప్రజలు ఇబ్బందుల పట్ల ఉదాసీనతను ప్రదర్శించిన ఆయన ఆ మరుక్షణమే భావోద్వేగానికి గురికావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అన్నారు. ఈ నేపథ్యంలో మోదీ లోక్‌సభకు వస్తే విపక్షాలు అడిగే ప్రశ్నల ఫలితంగా ఆయన ముఖంలో ఏరకమైన హావభావాలు కనిపిస్తాయో చూద్దామంటూ పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడిన సందర్భంగా రాహుల్‌గాంధీ చమత్కరించారు. మోదీ లోక్‌సభకు వచ్చి చర్చలో పాల్గొంటే ప్రతిదీ పరిష్కారం అవుతుందని నీళ్లకు నీళ్లు పాలకు పాలు పరిష్కారమవుతాయని ఆయన అన్నారు. లోక్‌సభలో మోదీ సమక్షంలోనే చర్చ జరిగితే నోట్ల రద్దుకు సంబంధించి బిజెపి నాయకులకు ఆయన ముందుగానే సమాచారం ఇచ్చారన్న విషయం తేలిపోతుందని చెప్పారు. కేవలం పార్లమెంటు వెలుపల మాట్లాడడమే తప్ప మోదీ లోక్‌సభకు రావడానికి జంకుతున్నారని, దీనికి కారణమేమిటో అర్థం కావడం లేదని అన్నారు.

శుక్రవారం లోక్‌సభ
సమావేశాలకు హాజరవుతున్న కాంగ్రెస్ ఎంపి రాహుల్‌గాంధీ