జాతీయ వార్తలు

రాజ్యాంగ స్ఫూర్తిని స్వీకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 25: ‘రాజ్యాంగం అంటే బాబాసాహెబ్. బాబాసాహెబ్ అంటే రాజ్యాంగం’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాజ్యాంగ లక్ష్యాల స్ఫూర్తిని అందిపుచ్చుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. రాజ్యాంగ దినోత్సవం (నవంబర్ 26)ను పురస్కరించుకొని లోక్‌సభ సచివాలయం శుక్రవారం ఇక్కడ నిర్వహించిన ‘అప్‌డేటెడ్ ఎడిషన్ ఆఫ్ కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా’, ‘మేకింగ్ ఆఫ్ ద కాన్‌స్టిట్యూషన్’ అనే రెండు పుస్తకాల విడుదల కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రోజులు గడచిన కొద్దీ అంబేద్కర్ చేసిన రాజ్యాంగ రచన ఎంత గొప్ప పనో మనకు మరింత అవగతం అవుతోందని అన్నారు. ‘కాలం మారింది. ప్రతి ఒక్కరు రాజ్యాంగంలో తమ హక్కుల కోసం వెతుకుతున్నారు. తమ హక్కులను పెంచుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు’ అని ఆయన అన్నారు. కొంతమంది తెలివైనవారు తమ పరిధులను అతిక్రమించటానికి రాజ్యాంగాన్ని ఆధారం చేసుకునేందుకు, దాన్ని దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
‘దీని ఫలితం ఒక రకమైన అరాచకం. బాబాసాహెబ్ అంబేద్కర్ అరాచకత్వం గురించి కూడా వివరించారు. అందరి మధ్య సామరస్యాన్ని సృష్టించే శక్తే రాజ్యాంగం. రాజ్యాంగాన్ని అనుసరించడం పౌరులు, పాలనా యంత్రాంగం, ప్రభుత్వంగా మనందరి బాధ్యత. వ్యవస్థను సున్నితంగా పనిచేయించే, కాపాడే శక్తి రాజ్యాంగానికి ఉంది’ అని మోదీ అన్నారు. ‘అందువల్ల రాజ్యాంగంలోని అధికరణాలను (ఆర్టికల్‌లను)ను అనుసరిస్తేనే సరిపోదు. రాజ్యాంగ స్ఫూర్తిని అందిపుచ్చుకోవడం ఎంతో అవసరం’ అని ఆయన పేర్కొన్నారు. దేశం స్వాతంత్య్రాన్ని సంపాదించుకున్నప్పుడు పౌరులలో బాధ్యతల నిర్వహణ తత్వం చాలా ఎక్కువగా ఉండేదని, కాలం గడుస్తున్న కొద్దీ బాధ్యతల నిర్వహణ అనేది హక్కులు ప్రకటించుకోవడంగా మారిందని ఆయన అన్నారు. ‘బాధ్యతలకు, హక్కులకు మధ్య సమతుల్యత ఎలా సాధించడం అనేది ఇప్పుడో సవాలు’ అని మోదీ పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవం గురించి ఆయన మాట్లాడుతూ జనవరి 26న జరుపుకునే గణతంత్ర దినోత్సవ బలం అనేది ‘నవంబర్ 26’ (రాజ్యాంగ దినోత్సవం)పై ఆధారపడి ఉందని అన్నారు. మన భవిష్యత్ తరాలు రాజ్యాంగాన్ని, దాని ప్రక్రియను, దాని లక్ష్యాలను అవగతం చేసుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. పాఠశాలలు, కళాశాలల్లో రాజ్యాంగాన్ని చదవాలని, వేడుక చోసుకోవాలని ఆయన సూచించారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌తో పాటు అనేక మంది కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని లోక్‌సభ సచివాలయంలో శుక్రవారం ‘అప్‌డేటెడ్
ఎడిషన్ ఆఫ్ కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా’ అనే పుస్తకాన్ని విడుదల చేస్తున్న ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, డిప్యూటీ స్పీకర్ తంబిదురై, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్