జాతీయ వార్తలు

స్పీకర్ సాయంతో జయ మాట్లాడుతున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, నవంబర్ 25: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోందని, శరీరంలో అన్ని కీలక అవయవాలు మామూలుగా పనిచేస్తున్నాయని అపోలో ఆసుప్రతి వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. శ్వాస సంబంధిత సమస్యంలో అపోలో ఆసుపత్రిలో చేరిన అన్నాడిఎంకె అధినేత్రి కొద్ది నిముషాలసేపుమాట్లాడడం జరిగిందని తాజా బులెటిన్‌లో పేర్కొన్నారు. జయలిలితను ఐసియు నుంచి ప్రత్యేక వార్డుకు మార్చిన తరువాత ఏలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదని అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి ప్రకటించారు. స్పీకర్ సహాయంతో ఆమె మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు. వాయునాళం ఉన్నప్పుడు మాట్లాడం లేదని, తాత్కాలికంగా స్పీకర్ సహాయంతో జయ మాట్లాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి సహకారం లేకుండా త్వరలోనే ముఖ్యమంత్రి మామూలుగా మాట్లాడుతారని ఆయన వెల్లడించారు. వెంటిలేటర్ లేకుండానే జయలలిత 90 శాతం శ్వాస తీసుకుంటున్నారని రెడ్డి తెలిపారు.