జాతీయ వార్తలు

రామ మందిరం నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బులంద్‌షహర్ (ఉత్తరప్రదేశ్), డిసెంబర్ 30: అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి మహేశ్ శర్మ చెప్పారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు కాని, మందిరం నిర్మాణంపై సంబంధిత పక్షాల మధ్య పరస్పరం అవగాహన కుదిరేవరకు కాని వేచిచూడాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అందువల్లే మందిరం నిర్మాణం ఆలస్యం అవుతోందని ఆయన చెప్పారు. వీలయినంత త్వరగా రామమందిరాన్ని నిర్మించాలనేది దేశ ప్రజల స్వప్నమని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రజలు ఇదివరకే తమ పార్టీకి, ప్రభుత్వానికి అధికారం ఇచ్చారని ఆయన అన్నారు. మంగళవారం ఇక్కడ ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రామమందిర నిర్మాణానికి బిజెపి కట్టుబడి ఉందని, ప్రజలు కూడా రామమందిరాన్ని నిర్మించి తీరాలని కోరుకుంటున్నారని అన్నారు. అయితే ఈ అంశం న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉందని ఆయన గుర్తుచేశారు. అయితే మంత్రి శర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయన తరువాత ఈ అంశంపై సీనియర్ నేతలు నిర్ణయం తీసుకుంటారని వివరణ ఇచ్చారు. అయోధ్యలో ఒక పెద్ద మ్యూజియంను కూడా నిర్మిస్తున్నట్టు ఆయన తెలిపారు. రామ్ వన్ గాన్‌మన్ పాథ్ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.170 కోట్లు విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని ఆయన చెప్పారు. అయితే రామమందిరం అంశం కోర్టులో ఉందని, కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని, ఇది రాజకీయేతర అంశమని మరో కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ అన్నారు.