జాతీయ వార్తలు

పాక్ కాళ్ల బేరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 26: జవాను తల నరికినందుకు ప్రతీకారంగా పాకిస్తాన్ సైనిక పోస్టులపై భారత బలగాలు భీకర దాడులు జరపడంతో దాయాది దేశం దిగివచ్చి ఆ దాడులను ఆపాల్సిందిగా భారత్‌కు విజ్ఞప్తి చేసిందని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ వెల్లడించారు. కాల్పుల విరమణ ఒప్పందానికి పదేపదే తూట్లు పొడుస్తూ సరిహద్దుల వెంబడి కవ్వింపులకు పాల్పడుతున్న పాక్ రేంజర్లు మంగళవారం భారత జవాను తల నరికి దారుణంగా హత్య చేయడంతో ఆ మరుసటి రోజే మన సైనికులు పూంచ్, రాజౌరీ, కెల్, మాచిల్ సెక్టార్లలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి పాక్ సైనిక పోస్టులపై భీకర దాడులు జరిపి దాయాది దేశానికి మరోసారి గట్టిగా బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. పాక్ దుశ్చర్యలకు మన బలగాలు దీటుగా సమాధానమివ్వడంతో దాయాది దేశం కాళ్ల బేరానికి వచ్చిందని, ప్రతీకార దాడులను ఆపాల్సిందిగా గురువారం భారత్‌ను వేడుకుందని, దీంతో ఎల్‌ఓసి వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది దాయాది దేశమేనన్న విషయాన్ని పాకిస్తాన్‌కు గుర్తు చేశానని శుక్రవారం గోవాలో జరిగిన ఒక ర్యాలీలో పారికర్ వెల్లడించారని ఎఎన్‌ఐ వార్తా సంస్థ పేర్కొంది. ‘పాక్ బలగాలపై కాల్పులు జరపాలన్నది మా అభిమతం కాదు. ఎల్‌ఓసి వెంబడి పదే పదే కాల్పులకు దిగుతూ భారత్‌ను కవ్విస్తోంది మీరే. కనుక మీరు ఇటువంటి దుశ్చర్యలను ఆపితే మేము కూడా ప్రతీకార దాడులను ఆపుతామని దాయాది దేశానికి స్పష్టం చేశా’ అని పారికర్ తెలిపారు.