జాతీయ వార్తలు

భారత్‌కు మంచి మిత్రుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 26: క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో మృతికి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. క్యాస్ట్రో భారత్‌కు ఓ మంచి స్నేహితుడని రాష్టప్రతి, ప్రధాని తమ సందేశంలో స్పష్టం చేశారు. ‘ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. క్యూబా ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని ప్రధాని ట్వీట్ చేశారు. 20వ శతాబ్దం ప్రపంచ నాయకుల్లో ఫిడెల్ క్యాస్ట్రో ఒకరని రాష్టప్రతి పేర్కొన్నారు. ప్రియతమ నేతను కోల్పోయి విషాదంలో ఉన్న క్యూబా ప్రజలకు భారత్ మద్దతుగా ఉంటుందని ప్రధాని ప్రకటనలో వెల్లడించారు. 90 ఏళ్ల ఫిడెల్ క్యాస్ట్రో శనివారం కన్నుమూశారు.
సోనియా దిగ్భ్రాంతి
క్యాస్ట్రో మృతిపట్ల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్మిక, కర్షక, అణగారిన వర్గాల తరపున పోరాడిని మహోన్నత వ్యక్తి క్యాస్ట్రో అని సోనియా ఓ సందేశంలో పేర్కొన్నారు. క్యూబా స్వేచ్ఛకోసం అవిశ్రాంత పోరాటం చేసిన క్యాస్ట్రో ప్రపంచ నాయకుల్లో ఒకరిగా ఎదిగారని ఆమె ప్రస్తుతించారు. ‘అలీన దేశాల ఉద్యమానికి ఆయన చేసిన సేవలు నిరుపమానం. ప్రతి భారతీయుల హృదయాల్లోనూ ఫిడెల్ చెరగని ముద్ర వేశారు’ అని కాంగ్రెస్ అధ్యక్షురాలు స్పష్టం చేశారు.
వామపక్షాల నివాళి
ప్రపంచ కమ్యూనిస్టు యోధుల్లో ఒకరైన ఫిడెల్ క్యాస్ట్రో మృతికి దేశంలోని వామపక్ష పార్టీలు ఘననివాళి అర్పించాయి. ‘్ఫడెల్ ఓ విప్లవ తార. భారత్‌లో వామపక్ష పార్టీలకు మంచి మిత్రుడు. మాకు స్పూర్తి ప్రదాత’ అని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి అన్నారు. అత్యంత వెనుకబడిన దేశమైన క్యూబాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. అక్షరాస్యత, అభివృద్ధి, వైద్యశాస్త్రం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని ఏచూరి తెలిపారు. ఆధునిక క్యూబా నిర్మాణానికి ఫిడెల్ క్యాస్ట్రో చేసిన కృషి మరువలేమని సిపిఐ పేర్కొంది. క్యూబా మాజీ అధ్యక్షుడి మృతి ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని పార్టీ తెలిపింది. క్యాస్ట్రో మృతి వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను విషాదంలో ముంచిందని సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపంకర్ భట్టాచార్య నివాళులర్పించారు.
బాలీవుడ్ సంతాపం
ముంబయి: క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో మృతిపట్ల బాలీవుడ్ ప్రముఖులు హన్సలాల్ మెహతా, మధుకర్ భండార్కర్, నటుడు సిద్దార్థ నివాళులు తెలిపారు. అగ్రరాజ్యం అమెరికా ఒత్తిళ్లకు లొంగకుండా క్యూబాను ఓ శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దిన విప్లవ నాయకుడు క్యాస్ట్రో అని వారు పేర్కొన్నారు. ఫిడెల్ ఆత్మకు శాంతి చేకూరాలని దర్శకుడు నిఖిల్ అద్వానీ ట్వీట్ చేశారు. నటుడు ఆయుష్మాన్ ఖురానా ప్రగాఢ సంతాపం తెలిపారు.
ఉక్కుపిడుగు క్యాస్ట్రో: గోర్బచెవ్
మాస్కో: అగ్రరాజ్యం అమెరికా వెన్నులో వణుకు పుట్టించిన యోధుడు ఫిడెల్ క్యాస్ట్రో అని సోవియట్ మాజీ అధ్యక్షుడు మిఖైల్ గోర్బచెవ్ శ్లాఘించారు. క్యూబా స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం తుదిశ్వాస వరకూ పోరాడారని ఆయన అన్నారు. సామ్యవాద పునాదులపై క్యూబా సర్వతోముఖాభివృద్ధికి ఉక్కుపిడుగు క్యాస్ట్రో అని గోర్బచెవ్ తన సందేశంలో పేర్కొన్నారు.
నిబద్ధతగల రాజనీతిజ్ఞుడు: పుతిన్
మాస్కో: క్యాస్ట్రో ఆధునిక రాజకీయ చరిత్రలో నిబద్ధతగల రాజనీతిజ్ఞుడని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శ్లాఘించారు. ‘రష్యాకు ఫిడెల్ విశ్వసనీయ, నిజమైన స్నేహితుడు’ అని ఓ సంతాప సందేశంలో ఆయన పేర్కొన్నారు. క్యూబా పితామహడుడైన ఫిడెల్‌ను కోల్పోవడం రష్యన్లకు ఎంతో బాధగా ఉందని ఆయన అన్నారు.

క్యాస్ట్రో జీవిత విశేషాలు
1926 ఆగస్టు 13: ఈస్ట్రన్ క్యూబాలోని బిరాన్‌లో జననం * ఏడుగురు తోడబుట్టిన వారిలో ఫిడెల్ మూడోవాడు * తండ్రి స్పానిష్ భూస్వామి. తల్లి గృహిణి * చిన్నప్పటి నుంచి చురుకైన, తెలివిగల విద్యార్థే
1953 జూలై 26: శాంటిగో డి క్యూబా మొన్సాడ బ్యారెక్‌పై దాడి. * క్యాస్ట్రో కనీసం 12సార్లు అరెస్టయి జైలుకెళ్లారు
1956 డిసెంబర్ 2: సెర్రా మెయిస్ట్రా వౌంటెన్స్‌లో సైనిక శిక్షణ
1959 జనవరి 1: నియంత ఫుల్‌గెన్షియో బటిస్టా పలాయానం. జనవరి 8న హవానాలో ప్రవేశం. ప్రధానిగా పదవీస్వీకారం
1959 ఏప్రిల్: 15-17 మధ్య అమెరికా ఉపాధ్యక్షుడు రిచర్డ్స్ నిక్సన్‌తో భేటీ
1960: సోవియట్ యూనియన్‌తో దౌత్య సంబంధాలకు శ్రీకారం
1961: క్యూబాతో యుఎస్ దౌత్య సంబంధాలు
1961 ఏప్రిల్ : 17-19 క్యాస్ట్రో వ్యతిరేక సైనికుల ఓటమి
1962 ఫిబ్రవరి 13: యుఎస్ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ క్యూబాకు వ్యతిరేకంగా డిక్రీ
1962 అక్టోబర్: సోవియట్ క్షిపణులు క్యూబాలో మోహరింపు
1963 ఏప్రిల్: క్యాస్ట్రో మొట్టమొదటిసారిగా సోవియట్ యూనియన్ పర్యటన
1965: క్యూబా కమూనిస్టు పార్టీ స్థాపన
1975: అంగోలాకు క్యూబా దళాలు
1990: సోవియట్ యూనియన్ పతనంతో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం
1995: తొలిసారి చైనాలో పర్యటన
2006 జూలై 31: రక్షణశాఖ చీఫ్, సోదరుడు రౌల్ క్యాస్ట్రోకు అధికారం అప్పగింత
2008 ఫిబ్రవరి: రౌల్ క్యాస్ట్రో అధ్యక్షుడిగా ప్రకటన
2015 జూలై 20: యుఎస్, క్యూబా పరస్పరం ఎంబసీలు పునఃప్రారంభించాలని నిర్ణయం

‘యుద్ధం ఆపే ప్రశే్న లేదు’
కోల్‌కతా, నవంబర్ 26: ప్రధానమంత్రి ప్రజావ్యతిరేక విధానం వల్ల దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ ఏర్పడిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ప్రజలను కష్టాలపాలు చేసిన మోదీ నిర్ణయంపై తుదకంటా పోరు సలుపుతామని ఆమె హెచ్చరించారు. తమ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులతో శనివారం భేటీ అయిన మమత మోదీ ప్రభుత్వం వైఖరిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘‘ఈ యుద్ధాన్ని ఆపేది లేదని మా అధినేత్రి స్పష్టం చేశారు. దేశంలో ప్రజలు ఈ విధమైన కష్టాల్ని ఎన్నడూ చవి చూడలేదు. నల్లధనంపై పోరాటం మాట ఎలా ఉన్నా సామాన్య పౌరులు మాత్రం ఇబ్బందుల పాలవుతున్నార’ని తృణమూల్ సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసమే: మాయావతి
న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వం నూటికి నూరుపాళ్లు రాజకీయ ప్రయోజనాలను ఆశించే పెద్ద నోట్లను రద్దు చేసిందని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. మోదీ నిర్ణయం వల్ల 90శాతం మంది ప్రజలు కష్టాలపాలయ్యారని ఆమె శనివారం విమర్శించారు.

‘‘్భవోద్వేగంతో కన్నీళ్లు కార్చటం వల్ల సమస్య పరిష్కారం కాదు. తాను తీసుకున్న నిర్ణయం సరైనదేనని నిరూపించుకోవలసిన బాధ్యత మోదీపై ఉంది. ఇది ప్రజలను బ్లాక్‌మెయిల్ చేయటం తప్ప మరేమీ కాదు’’ అని మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా, ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవటానికి తగిన విధంగా సమాయత్తం కాకుండా హడావిడిగా తొందరపడి నిర్ణయం తీసుకున్నారని మోదీ సర్కారుపై మాయావతి విరుచుకుపడ్డారు. మోదీ రాజకీయ ప్రయోజనాల కోసం దేశమంతటా సంక్షోభాన్ని సృష్టించారని అన్నారు. ప్రజల ప్రయోజనాలతో ఆటలాడటం మంచిది కాదని, నియంతృత్వ ధోరణి ఎంతమాత్రం మంచిది కాదని ఆమె మోదీకి హితవు చెప్పారు.