జాతీయ వార్తలు

అలీనోద్యమంలో కీలక పాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 26: క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో భారత్‌కు అత్యంత ఆప్తమిత్రుడు. ఆలీన ఉద్యమంలో ఆయన కీలకభూమిక పోషించారు. తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఫిడెల్‌తో మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. 1959లో క్యూబా విప్లవం తరువాత అధికారం చేపట్టిన క్యాస్ట్రో అలీన దేశాలకు స్నేహపాత్రుడిగానే ఉండేవారు. కమ్యూనిస్టు క్యూబాకు అగ్రరాజ్యం అమెరికా ఆంక్షలున్నప్పటికీ భారత్ అన్ని రకాల సహాయ, సహకారాలు అందించింది. ఇరుదేశాల మధ్య రాజకీయ, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు కొనసాగుతున్నాయి. అమెరికా ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించేవారకూ అంటే ఆరు దశాబ్దాల పాటు క్యూబాకు భారత్ చేదోడువాదోడుగా ఉంటూ వచ్చింది. 1960లో న్యూయార్క్‌లో ఐరాస సర్వసభ్య సమావేశం జరుగుతోంది. అక్కడి ఐదు నక్షత్రాల హోటల్‌లో ఉండేందుకు అవకాశం ఉన్నప్పటికీ క్యాస్ట్రో తిరస్కరించారు. థెరెస్సా హోటల్ యజమాని స్వయంగా వచ్చి ఆహ్వానించినా ఆయన వినలేదు. అనేక మంది అంతర్జాతీయ నాయకులు క్యాస్ట్రోను మర్యాదపూర్వకంగా కలిసివెళ్లారు. భారత్‌తో తనకున్న సంబంధాలను క్యూబా పితామహుడే ఓ సందర్భంలో గుర్తుచేసుకున్నారు. అప్పటి విదేశాంగ మంత్రి నట్వర్‌సింగ్ కలిసినప్పుడు ఆయన జ్ఞాపకాలను మననం చేసుకున్నారు. ‘నన్ను మొట్టమొదటిసారిగా చూడడానికి వచ్చిన వ్యక్తి భారత్ తొలి ప్రధాని నెహ్రూ. ఆ రోజు నేను ఇప్పటికీ మరిచిపోలేదు. అప్పట్లో నా వయస్సు 34 ఏళ్లు. నెహ్రూ నాతో మాట్లాడడం నన్ను టెన్షన్‌కు గురిచేసిందనే చెప్పవచ్చు’ అని నట్వర్‌సింగ్‌తో ఆయన అన్నారు. నెహ్రూతో మాట్లాడాక టెన్షన్ తొలగిపోయిందని ఫిడెల్ గుర్తుచేసుకున్నారు. భారత్‌తో సంబంధాలు తనకు మంచి అనుభవాన్ని నేర్పాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇనే్నళ్లూ ఆ మైత్రి కొనసాగుతునే ఉంది. తరువాత ఇందిరతో ఆయన అనేక పర్యాయాలు భేటీ అయ్యారు. 1973 సెప్టెంబర్‌లో క్యాస్ట్రో వియత్నాం వెళ్తూ ఢిల్లీలో ఆగారు. ప్రధాని ఇందిరాగాంధీతో కలిసి డిన్నర్ చేశారు. 1985లో ఆగస్టులో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ క్యూబాను సందర్శించారు. దౌత్య సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవాలని ఇరువురు అధినేతలు నిర్ణయించారు. 2006లో ప్రధాని మన్మోహన్‌సింగ్, 2013 అక్టోబర్‌లో ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీ క్యూబాలో పర్యటించారు. ఫిడెల్ క్యాస్ట్రో మృతిపై తీవ్ర మాజీ విదేశాంగ మంత్రి నట్వర్‌సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్యూబా అధినేతతో ఆరేడు సార్లు హవానా, ఢిల్లీలో సమావేశమయ్యానని, ఆయన భారత్‌కు నిజమైన స్నేహితుడని సింగ్ స్పష్టం చేశారు.
chitram...
మాజీ రాష్టప్రతి జ్ఞానీ జైల్‌సింగ్, మాజీ ప్రధాని ఇందిరా గాంధీతో క్యాస్ట్రో