జాతీయ వార్తలు

జడ్జీల నియామకంపై మళ్లీ పేచీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యాయ వ్యవస్థ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం
న్యాయమూర్తుల కొరతతో కోర్టులు పనిచేయట్లేదని సిజెఐ జస్టిస్ ఠాకూర్ ఆవేదన
సంక్షోభ ముగింపునకు సర్కారు చొరవ చూపాలని సూచన
విభేదించిన న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్
ఈ ఏడాది 120 మంది జడ్జీలను నియమించామని వెల్లడి

న్యూఢిల్లీ, నవంబర్ 26: న్యాయ వ్యవస్థకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఉన్న విభేదాలు మరోసారి బహిరంగంగా బయటపడ్డాయి. హైకోర్టులు, ట్రిబ్యునళ్లలో న్యాయమూర్తుల కొరత ఉందని, ఈ ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వ చొరవ అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) టిఎస్ ఠాకూర్ పేర్కొనగా, ఆయన వాదనతో కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గట్టిగా విభేదించారు. ఒకే వేదికపై వీరిరువురు పరస్పరం భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. శనివారం ఇక్కడ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) అఖిల భారత సదస్సులో జస్టిస్ ఠాకూర్ మాట్లాడుతూ ‘హైకోర్టుల్లో 500 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ రోజు అవి పనిచేయాలి. కాని చేయడం లేదు. ప్రస్తుతం దేశంలో అనేక ఖాళీ కోర్టు గదులు ఉన్నాయి. కానీ, న్యాయమూర్తులు అందుబాటులో లేరు. న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి పెద్ద సంఖ్యలో ప్రతిపాదనలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ సంక్షోభానికి ముగింపు పలుకుతుందని విశ్వసిస్తున్నాను’ అని అన్నారు. అయితే మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ ‘మేము గౌరవంగా ఆయన (సిజెఐ)తో విభేదిస్తున్నాం. ఈ సంవత్సరం మేము 120 మంది న్యాయమూర్తులను నియమించాం. 1990 నుంచి ఇదే రెండో అతి పెద్ద నియామకం. 2013లో అత్యధిక సంఖ్యలో 121 మంది న్యాయమూర్తులను నియమించారు. దిగువ న్యాయ వ్యవస్థలో ఐదు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీలో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదు. ఈ విషయంలో న్యాయ వ్యవస్థే జాగ్రత్తలు తీసుకోవాలి’ అన్నారు. ‘వౌలిక సౌకర్యాల విషయానికి వస్తే, అది నిరంతర ప్రక్రియ. పెద్ద సమస్య అయిన నియామకాల విషయంలో మరింత పారదర్శకత, నిష్పాక్షికత, సహేతుకతతో కూడిన మార్గదర్శకాలను (మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్-ఎంఒపి) రూపొందించడంపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవలసి ఉంది. సుప్రీంకోర్టు నిర్ణయంకోసం ప్రభుత్వం గత మూడు నెలల నుంచి వేచిచూస్తోంది’ అని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు.
ట్రిబ్యునళ్లలో వౌలిక సదుపాయాల కొరతతోపాటు మానవ వనరుల కొరత కూడా ఉందని, ఫలితంగా కేసులు అయిదు నుంచి ఏడేళ్ల వరకు పెండింగ్‌లో ఉంటున్నాయని జస్టిస్ ఠాకూర్ అన్నారు. ‘ట్రిబ్యునళ్లలో వ్యవహారాలను పరిశీలిస్తే మీ (ట్రిబ్యునళ్లు) పరిస్థితి కూడా బాగా లేదని అర్థమవుతోంది. మీరు కూడా మానవ వనరుల కొరతతో బాధపడుతున్నారు. మీరు మానవ వనరుల కొరత వల్ల ఒక ట్రిబ్యునల్‌ను కాని ఒక ధర్మాసనాన్ని కాని నెలకొల్పలేకపోతున్నారు. ఈ ట్రిబ్యునల్ మొత్తం సంఖ్య 65. అందులో 18 నుంచి 20 ఖాళీలు ఉన్నాయి. అంటే పెద్ద సంఖ్యలో కొరత ఉంది. అందువల్ల పని దెబ్బతింటోంది. అయిదేళ్లకు పైగా, ఏడేళ్లకు పైగా కాలం నుంచి కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయి’ అని ఆయన పేర్కొన్నారు. కనీసం ట్రిబ్యునళ్లు అయినా పూర్తి స్థాయి మానవ వనరులతో నడిచేట్లుగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ రోజు పరిస్థితి ఎలా అయిందంటే ట్రిబ్యునల్‌కు నేతృత్వం వహించడానికి ఏ ఒక్క రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి కూడా ముందుకు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పదవీ విరమణ చేసిన సహచరులను ట్రిబ్యునళ్లకు పంపించాలంటే తనకు బాధ వేస్తోందని ఆయన పేర్కొన్నారు.
నిబంధనలను సవరించాలి
వివిధ ట్రిబ్యునళ్ల చైర్‌పర్సన్లు, సభ్యుల నియామకానికి సంబంధించిన నిబంధనలను సవరించాల్సిన అవసరం ఉందని జస్టిస్ ఠాకూర్ అన్నారు. హైకోర్టు న్యాయమూర్తులు కూడా ఈ పదవులకు అర్హులు అయ్యేలాగా నిబంధనలను సవరించాలని ఆయన సూచించారు. అన్ని ట్రిబ్యునళ్లలో కన్నా క్యాట్ బాగా పని చేస్తోందని మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. క్యాట్ ఇచ్చిన తీర్పులు అనేకం హైకోర్టులు, సుప్రీంకోర్టులో సవాళ్లకు గురవుతున్నాయని, దీనివల్ల పెండింగ్ వ్యాజ్యాల సంఖ్య పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రత్యామ్నాయంగా ట్రిబ్యునళ్లలోనూ ‘ఇంటర్ కోర్ట్ అప్పీల్’ను ప్రవేశపెట్టే అంశాన్ని ఆలోచించాలని ఆయన సూచించారు.

నరేంద్ర వౌన మోదీ

ప్రధానిపై ఏచూరి విమర్శ సమ్మెను వ్యతిరేకించిన తృణమూల్

బెంగళూరు, నవంబర్ 26: పెద్ద నోట్ల రద్దుపై మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి సమర్థించారు. ఈ అంశంపై పార్లమెంట్‌లో నోరు మెదపకుండా వౌనం వహించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ‘నరేంద్ర వౌన మోదీ’ అంటూ ఏచూరి ఎద్దేవా చేశారు. శనివారం బెంగళూరులో విలేఖరులతో మాట్లాడుతూ, ‘గతంలో మన్మోహన్ సింగ్‌ను వౌన మోహన్ సింగ్ అంటూ విమర్శించిన మోదీ ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై పార్లమెంట్‌లో నోరు మెదపకుండా వౌనంగా కూర్చుంటున్నారు. విరామం తర్వాత మోదీ మళ్లీ పార్లమెంట్‌కు తిరిగి రాలేదు’ అని విమర్శించారు.
మోదీపై అమర్ సింగ్ ప్రశంసలు
పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం ‘ఎంతో సాహసోపేతమైన ప్రయోగమని’ సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అమర్ సింగ్ అభినందించారు. దేశంలో అవినీతిని, నల్లధనాన్ని, దొంగ నోట్లను నిర్మూలించేందుకు మోదీ ఎంతో ధైర్యంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని అన్నారు. మోదీ ప్రభుత్వం ముందస్తుగా తగిన ఏర్పాట్లు చేయకుండా పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని అమలు చేస్తుండటం వలన ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ, నల్లధనంతోపాటు అక్రమార్కులు లెక్కలో చూపని నగదు ‘సర్దుబాటు’ కాకుండా నిరోధించేందుకు ఈ నిర్ణయం దోహదపడిందని అమర్ సింగ్ ప్రశంసించారు. కాగా, పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ఈ నెల 28వ తేదీన వామపక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన సార్వత్రిక సమ్మెను వ్యతిరేకిస్తున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ స్పష్టం చేసింది.

పాక్ ఆర్మీ చీఫ్‌గా
కమర్ జావెద్ బజ్వా

మంగళవారం బాధ్యతల స్వీకారం
ఇస్లామాబాద్, నవంబర్ 26: పాకిస్తాన్ తదుపరి సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ కమర్ జావెద్ బజ్వా నియమితుడయ్యాడు. ఇస్లామిక్ ఉగ్రవాద గ్రూపులపై ఉక్కు పాదం మోపి దేశ అంతర్గత భద్రతను మెరుగుపర్చిన సైనిక నాయకుడిగా పేరు పొందిన బజ్వాను ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ శనివారం ఈ పదవిలో నియమించారని ఆయన అధికార ప్రతినిధి తెలిపారు. బ్రిటన్ నుంచి 69 ఏళ్ల క్రితం స్వాతంత్య్రాన్ని పొందిన నాటి నుంచి అత్యధిక కాలం పాటు సైనిక పాలనలో మగ్గిన పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పాలకుల కంటే సైన్యాధిపతే అత్యంత శక్తిమంతుడన్నది జగమెరిగిన సత్యం. సంఖ్యా పరంగా ప్రపంచంలోని అతిపెద్ద సైనిక దళాల్లో ఆరవదిగా ఉన్న పాకిస్తాన్ సైనిక దళానికి ప్రస్తుతం అధిపతిగా వ్యవహరిస్తున్న జనరల్ రహీల్ షరీఫ్ మంగళవారం పదవీ విరమణ పొందనున్నారు. దీంతో ఆయన స్థానంలో పాక్ సైన్యాధిపతిగా బజ్వా మంగళవారం బాధ్యతలు చేపట్టనున్నారు.