జాతీయ వార్తలు

గమనిస్తున్నాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 27: పెద్ద నోట్ల రద్దుపై రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఎట్టకేలకు వౌనాన్ని వీడారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని రోజు వారీగా సమీక్షిస్తూ, ప్రజల వాస్తవిక సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని, సాధ్యమైనంత త్వరగా పరిస్థితులను మళ్లీ సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాత 1000, 500 రూపాయల నోట్లను మార్పిడి చేసుకోవడంతో బ్యాంకుల్లో డిపాజిట్లు భారీగా పెరిగాయని, దీంతో నగదు నిల్వ నిష్పత్తి (సిఆర్‌ఆర్) పూర్తిగా 100 శాతం అందుబాటులో ఉండేలా ఆర్‌బిఐ చర్యలు చేపట్టిందని చెప్పారు. మార్కెట్ స్థిరీకరణ పథకానికి (ఎంఎస్‌ఎస్) సంబంధించిన బాండ్లను ప్రభుత్వం తగిన సంఖ్యలో జారీ చేసిన తర్వాత ఈ నిర్ణయంపై మళ్లీ సమీక్ష జరుపుతామని అన్నారు. రద్దయిన పెద్ద నోట్లతో సరిసమానంగా కొత్త 500, 100 రూపాయల నోట్లను ముద్రించే ప్రక్రియను ప్రింటింగ్ ప్రెస్‌లు ఇప్పటికే ప్రారంభించాయని ఉర్జిత్ పటేల్ తెలిపారు. ప్రజలు సులభంగా, చౌకగా లావాదేవీలు జరిపేందుకు నగదు బదులుగా డెబిట్ కార్డులు, డిజిటల్ వాలెట్ల లాంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనివలన దేశ ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలంలో నగదు వినియోగం తక్కువగా ఉండే ఆర్థిక వ్యవస్థగా మారి అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలుస్తుందన్నారు. అలాగే బ్యాంకులు కూడా పోస్ (పాయింట్ ఆఫ్ సేల్) యంత్రాల వాడకాన్ని మరింతగా ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు.

దీని వలన డెబిట్ కార్డుల వినియోగం పెరిగి నగదు లావాదేవీలు తగ్గుతాయని ఉర్జిత్ పటేల్ తెలిపారు.