జాతీయ వార్తలు

నా కథలన్నీ నిజమైన అబద్ధాలు.. రస్కిన్ బాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 27: దశాబ్దాలుగా పిల్లలనూ, పెద్దలనూ తన కథల ద్వారా ఆకట్టుకుంటూ భిన్న అంశాలను తెరపైకి తెస్తూ అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ప్రఖ్యాత రచయిత రస్కిన్ బాండ్ తన కథలన్నీ నిజమైన అబద్ధాలేనంటూ ఓ ఆసక్తికర సందేశాన్ని ఇచ్చారు. కథను చెప్పడమన్నది కల్పనకు వాస్తవికతను జోడించడమేనన్నది ఆయన పేర్కొన్నారు. ఈ రకమైన కల్పనలతో కూడిన వాస్తవిక జీవన విధానం తాను రాసిన కథలన్నింటిలోనూ స్పష్టంగా గోచరిస్తున్నదని, అందుకే తన కథలన్నీ నిజమైన అబద్ధాలేనని స్పష్టం చేశారు. కల్పనకు ఆసక్తిని జోడించాలంటే అందుకు కొంత వాస్తవికతను కల్పించాల్సి ఉంటుందని అప్పుడే ఆసక్తి అన్నది పెరుగుతుందని వెల్లడించారు. అవునా, నిజమా అన్న రీతిలో కల్పన సైతం వాస్తవానుభూతిని కలిగించాలంటే ఊహకు, నిజానికి మధ్య బలమైన బంధాన్ని భాషాపరంగా నిర్మించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా వాస్తవానుగుణంగా ఈ కల్పనాశక్తికి పదును పెట్టినప్పుడే ఏ కథైనా ఆకట్టుకుంటుందని, ఆసక్తినీ కలిగిస్తుందని ఆయన వెల్లడించారు. టైమ్స్ సాహితీ ఉత్సవంలో మాట్లాడిన ఆయన వ్యక్తిత్వ నిమిత్తం లేకుండా, పరిసరాలు, వాస్తకవికతకు సంబంధం లేకుండా ఉండే ఏ ఇతివృత్తమూ రాణించదని స్పష్టం చేశారు. ఈ వౌలిక సాహితీ ధర్మాన్ని తన కథలన్నింటిలోనూ పాటించడం వల్లే కల్పన సైతం వాస్తవికంగా ప్రతి ఒక్కరినీ అలరించిందని వెల్లడించారు.