జాతీయ వార్తలు

అవినీతిని అరికడుతుంటే.. బంద్‌లా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుషినగర్ (ఉత్తరప్రదేశ్), నవంబర్ 27: ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా పెద్దనోట్లను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ‘్భరత్ బంద్’కు పిలుపునిచ్చిన ప్రతిపక్షాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. అవినీతిని, నల్లధనాన్ని నిర్మూలించడానికి తాను ప్రయత్నిస్తుంటే వారు బంద్‌లు చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆయన పరోక్షంగా ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. భారత్ బంద్ కావాలా, అవినీతి నిర్మూలన కావాలా? అంటూ ఆయన ప్రజలను ప్రశ్నించారు. నోట్ల రద్దు నిర్ణయం కఠినమైనదేనని, అయితే దీనివల్ల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ప్రధాని అన్నారు. నగదు ఉపసంహరణకు సామాన్య ప్రజలు, గ్రామీణులు పడుతున్న అవస్థలను ఆయన ప్రస్తావిస్తూ, ఈ-వ్యాలెట్ మార్గాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. ‘వ్యాలెట్ (పర్సు) ఉపయోగించే రోజులు పోయాయి. మీరు మీ మొబైల్ ఫోన్‌ను బ్యాంకు శాఖలాగా ఉపయోగించండి. అదే మొబైల్‌తో మీరు ఫొటోలు తీసుకొని స్నేహితులకు పంపించుకోవచ్చు’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
అఖిలేశ్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ ధ్వజం
అంతర్గత కలహాలు ముగిసిపోతే రైతుల సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టాలని హితవు
ప్రజా సమస్యలు పట్టని యుపి సర్కార్
కుషినగర్ (ఉత్తరప్రదేశ్), నవంబర్ 27: ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదంటూ ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. రైతుల సంక్షేమానికి ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పథకాలపై కేంద్రీకరించడానికి మీ అంతర్గత కలహాలు ముగిసిపోయాయా? అని ఆయన అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రం నిధులతో రైతుల సంక్షేమానికి తీసుకొచ్చిన పథకాలను అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆయన విమర్శించారు. ‘మీ వివాదాలను పరిష్కరించుకున్నట్లయితే, యుపిలో పంటల బీమా పథకాన్ని అమలు చేయండని నేను యుపి ప్రభుత్వాన్ని అడగదలచుకున్నాను. వారు అలా చేస్తారని మాత్రం నేను అనుకోవడం లేదు. సమస్యలను పరిష్కరించాలనే ఆసక్తి వారికి లేదు’ అని మోదీ ఆదివారం ఇక్కడ బిజెపి నిర్వహిస్తున్న ‘పరివర్తన్ యాత్ర’ ర్యాలీలో మాట్లాడుతూ అన్నారు. మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో తలెత్తిన అంతర్గత కలహాలను మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. భోజ్‌పురి భాషలో తన ఉపన్యాసాన్ని ప్రారంభించిన మోదీ ఎక్కువ భాగం చెరకు రైతుల సమస్యలపై మాట్లాడారు. ‘అధికారంలో ఉన్నవారు పాలకులుగా పిలుచుకునే రోజులు పోయాయి. నేను మీ సేవకుడిని.. మీకోసం పనిచేయడం నా బాధ్యత. మీరు నాకెంతో ఇచ్చారు. నేను మీకు రుణపడి ఉన్నాను’ అని మోదీ రైతులను ఉద్దేశించి భావోద్వేగంతో అన్నారు. ‘2014-15లో చెరకు రైతులకు చెల్లించాల్సిన బకాయిల మొత్తం రూ.22వేల కోట్లకు పెరిగిపోయింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ బకాయిల గురించి పట్టించుకోలేదు. మేము కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక చెరకు రైతుల గురించి పట్టించుకోవాలని నిర్ణయించుకున్నాము. ఇప్పుడు చాలా తక్కువ మొత్తంలోనే బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి’ అని మోదీ అన్నారు.
‘చక్కెర మిల్లుల యజమానులు నన్ను కలిసినప్పుడు ప్యాకేజీ ఇవ్వాల్సిందిగా కోరారు. ప్యాకేజీ తీసుకునే మీ అలవాటు పాత రోజుల నాటిది. నేను మీకు ఏది కావాలంటే అది ఇస్తాను. తరువాత మీ వద్దకు అధికారులను పంపిస్తాను. ఎవరి బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయో జాబితా ఇవ్వాలని వారు అడుగుతారు అని నేను అన్నాను’ అని మోదీ వివరించారు. ‘ప్యాకేజీ చక్కెర మిల్లులకు కాకుండా చక్కెర రైతులకు ఇస్తానని తరువాత చెప్పాను. రైతులకు ఉన్న బకాయిలను నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తామని తెలిపాను’ అని మోదీ వెల్లడించారు. మధ్య దళారులను నివారించడానికే రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పానని ఆయన వివరించారు. పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా వినియోగించే ఇథనాల్‌ను ఉత్పత్తి చేయడానికి తగిన యంత్రాలను బిగించాలని చక్కెర మిల్లుల యజమానులకు సూచించారు. చక్కెర ధరలు పడిపోతే ఇథనాల్‌ను ఉత్పత్తి చేయాలని సూచించారు.