జాతీయ వార్తలు

కళ తప్పిన రాహుల్, మమత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, నవంబర్ 27: పెద్ద నోట్ల రద్దు కారణంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలకు నిద్రపట్టడం లేదని, వారి ముఖంలో కళ తగ్గిందని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. 500, 1000 నోట్ల రద్దువల్ల ఆందోళన చెందుతున్న వారంతా నల్లధనం ఉన్నవారేనని, దాన్ని ఎప్పుడు కోల్పోతామోనన్న భయమే వారిలో నిరంతరం భయాన్ని కలిగిస్తోందని, నిద్ర పట్టనివ్వడం లేదని అమిత్ షా అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో ఇదే రకమైన సమస్య తలెత్తిందని ఆదివారం నాడిక్కడ జరిగిన బిజెపి ‘ఇతర వెనుకబడిన వర్గాల’ ర్యాలీలో షా అన్నారు. ఈ నెల 7 వరకు నల్లధనం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీని వీరందరూ అనేక రకాలుగా ప్రశ్నించారని, నల్ల కుబేరులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ నిలదీశారని గుర్తుచేసిన అమిత్ షా ‘ఎప్పుడైతే నవంబర్ 8 అర్ధరాత్రి పెద్దనోట్లు చెల్లకుండా పోయాయో ఆ క్షణం నుంచే వీరందరి వైఖరిలో మార్పు వచ్చింది. అంతకుముందు వరకు వీరు చెప్పింది ఒకటైతే, అనంతరం ఒక్కటై మోదీని తప్పుబట్టడం మొదలెట్టారు’ అని అమిత్ షా గుర్తుచేశారు. నల్లధనాన్ని సమూలంగా నిర్మూలించాలని పట్టుబట్టిన వీరందరూ అదే ప్రయత్నం చేసిన మోదీని విమర్శించడంలో ఉద్దేశమేమిటని ప్రశ్నించారు. మొత్తం ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకమై పెద్దనోట్ల రద్దుపై మోదీపై విమర్శలు గుప్పిస్తున్నాయని పేర్కొన్న అమిత్ షా ‘ఇప్పుడు దేశంలో ఒక రకమైన వరద పరిస్థితి నెలకొంది. మధ్యలో ఒకే ఒక వృక్షం ఉంది. దానిపైన ఓ ఎలుక, ఓ పిల్లి, ఓ పాము ఎక్కి తమ ప్రాణాలు కాపాడుకున్నాయి’ అని వర్ణించారు. అయితే ఇదే చెట్టుపై ఉన్న ముంగీస పామును తినడం లేదు, అలాగే పిల్లి కూడా ఎలుకను తినడం లేదు. అందుకు కారణం ఇవన్నీ కూడా తమను తాము రక్షించుకోవడానికే కింద ప్రవహిస్తున్న నీటిలో పడిపోకుండా ప్రయత్నిస్తున్నాయన్నారు. నిన్న మొన్నటి వరకు ఒకదానితో ఒకటి కత్తులు దూసిన ప్రతిపక్షాలన్నీ మోదీకి వ్యతిరేకంగా చేతులు కలపడంలో ఉద్దేశం తమ ఉనికిని కాపాడుకోవడానికేనని అన్నారు.