జాతీయ వార్తలు

ఏపిలో వైద్య పరికరాల సమాఖ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 28: ఆంధ్రప్రదేశ్‌లో వైద్య పరికరాల అభివృద్ధి సమాఖ్య (ఎండిపిసి)ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఆయన సోమవారం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్‌తో పార్లమెంటు ఆవరణలోని తమ కార్యాలయంలో సమావేశమై ఎండిపిసి ఏర్పాటు గురించి చర్చించారు. ఎండిపిసిని త్వరగా ఏర్పాటు చేయాలని అనంతకుమార్‌కు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లోని మెడ్ టెక్ జోన్‌లో ఏర్పాటు చేయనున్న ఎండిపిసికి డిసెంబర్ ఆఖరువారంలో శంకుస్థాపన జరుగుతుందని వెంకయ్యనాయుడు చెప్పారు. వైద్య పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్ర ఫార్మాసూటికల్ శాఖ ఎండిపిసిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఏఎంటిజడ్ ప్రాంతంలో ఎండిపిసిని ఏర్పాటు చేస్తామంటూ చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని వెంకయ్య వివరించారు.
చంద్రబాబు లేఖ రాసిన అనంతరం వెంకయ్యనాయుడు చొరవ చూపించి అనంతకుమార్‌తో సమావేశమై దీని ఏర్పాటు గురించి చర్చించారు. రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, కేంద్ర సైన్సు, టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి, ముఖ్య కార్యదర్శి మాలకొండయ్య తదితరులు కూడా సమావేశానికి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పది జన ఔషధి దుకాణాలను ఏర్పాటు చేయాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు.
వివరించారు.
చిత్రం...
పార్లమెంట్ హ స్‌లో సోమవారం కేంద్ర మంత్రి అనంత కుమార్‌తో భేటీ అయన వెంకయ్య నాయుడు