జాతీయ వార్తలు

ఇప్పటికే చిల్లిగవ్వ లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 28: దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలను పెంపొందించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు. ఇప్పటికే దేశంలో నగదు అన్నదే లేదని ఎద్దేవా చేశారు. 86 శాతం పెద్దనోట్ల రద్దు కారణంగా ఎవరి దగ్గరా చిల్లిగవ్వ కూడా లేకుండా పోయిందని, నగదు రహిత భారతానికి ఇంతకుమించిన ఉదాహరణ ఏమిటని ఆయన అన్నారు. నగదు రహిత లావాదేవీలను పెంపొందించాలంటే అందుకు దోహదం చేసే విధంగా వ్యవస్థాగతమైన ఏర్పాట్లను బలోపేతం చేయాల్సి ఉంటుందని, అలాంటి ప్రయత్నమేదీ లేకుండా ఈ లక్ష్యం ఎలా నెరవేరుతుందని ఆయన ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా 70 కోట్ల మంది ప్రజలు నెల 10వేల రూపాయల చొప్పున ఆదాయం పొందుతున్నారని, వీరంతా కూడా ఈ మొత్తాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయరని, ఇళ్లలోనే దాచుకుంటారని కపిల్ సిబాల్ అన్నారు. అలాంటివారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించిన ఆయన చాలాచోట్ల బ్యాంకులు గాని, ఏటిఎంలు గాని లేనేలేవని, తమ వద్ద ఉన్న మొత్తాన్ని డిపాజిట్ చేయాలంటే వీరు 20 కి.మీ. పైగా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటోందని తెలిపారు. నోట్ల రద్దు పుణ్యమా అని ఇప్పుడు జనం వద్ద కనీస ఖర్చులకు కూడా డబ్బులేని పరిస్థితి తలెత్తిందన్నారు.
క్యాస్ట్రో అంత్యక్రియలకు
8మంది సభ్యుల భారత్ బృందం
న్యూఢిల్లీ, నవంబర్ 28: క్యూబా నాయకుడు ఫిడెల్ క్యాస్ట్రో అంత్యక్రియలకు కేంద్ర హోమంత్రి రాజ్‌నాథ్ సారథ్యంలో 8మంది సభ్యుల భారత్ బృందం హాజరుకానుంది. ఈ బృందంలో వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులకు అవకాశం ఉంటుంది. ఈ బృందంలో లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ శర్మ, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ కార్యదర్శి డి.రాజా, బిజెడి ఎంపీ ఝినా హికాకా, బిజెపి ఎంపీ రమేష్ డెకా, సమాజ్‌వాది ఎంపీ జావెద్ అలీఖాన్ ఉంటారు. ఈ బృందం మంగళవారం హవానాకు వెళుతుందని క్యాస్ట్రో అంత్యక్రియల అనంతరం గురువారం తిరిగివస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.