జాతీయ వార్తలు

ఉసురు పోసుకుంటున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 28: పెద్దనోట్లను రద్దు చేయటం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సామాన్య ప్రజల ఉసురు పోసుకుంటున్నారని వామపక్షాలు ఆరోపించాయి. జన ఆక్రోశ్ దివస్‌లో భాగంగా సిపిఎం, సిపిఐలతో సహా ఏడు వామపక్షాల నేతలు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నాయి. దేశంలో అసాధారణ ఆర్థిక సంక్షోభాన్ని మోదీ సృష్టించారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఇది పేదలకు వ్యతిరేకం, కార్పొరేట్లకు అనుకూలమైన ప్రభుత్వమని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. నోట్ల రద్దుతో దేశాన్ని దిగ్బంధం చేశారని ఆయన అన్నారు. ‘దేశంలో 90శాతం మంది ప్రజలు రోజూ నగదు సహిత లావాదేవీలు నిర్వహిస్తారు. ఇప్పుడు వాళ్ల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి’ అని ఏచూరి ఆరోపించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఒకవైపు జరుగుతున్నా.. మోదీ సభకు రాకుండా, సభలో సమాధానం చెప్పకుండా, బయటి వేదికలపై మాత్రం మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 1000నోటును రద్దు చేసి, రూ.2000 నోటును ప్రవేశపెట్టడం వల్ల అవినీతిని రెట్టింపు చేశారన్నారు. ‘‘నవంబర్ 8 నోట్ల రద్దు నిర్ణయం వెలువడటానికి ముందే బిజెపి నేతలు తమ దగ్గరున్న నల్లధనంతో బీహార్‌లో భూములు కొనుగోలు చేశారని, వాళ్లకు నోట్ల రద్దు సమాచారం ఎలా తెలిసిందని’’ ఏచూరి ప్రశ్నించారు. కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చేంత వరకూ పాత నోట్లను చెలామణిలోనే ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ తాను అధికారంలో ఉన్నప్పుడు వౌన్‌మోహన్‌సింగ్‌గా ఉన్నప్పటికీ, ఇప్పుడు నోట్ల రద్దుపై ఆయన రాజ్యసభలో మాట్లాడారని, ప్రధాని మోదీ మాత్రం వౌనంగా ఉన్నారని ఆయన వ్యంగ్యంగా పేర్కొన్నారు.

భారత్ బంద్‌లో భాగంగా సోమవారం ఢిల్లీలోని మండీహౌస్ నుంచి జంతర్ మంతర్ వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ నేతలు అతుల్ కుమార్ అంజాన్, డి.రాజా, ఇతర వామపక్షాల నేతలు

పట్టుబడ్డ మింటూ

నిజాముద్దీన్ స్టేషన్‌లో ఖలిస్తాన్ నేత అరెస్టు ధ్రువీకరించిన పోలీసులు

న్యూఢిల్లీ, నవంబర్ 28: పంజాబ్‌లోని నభా జైలునుంచి తప్పించుకున్న ఖలిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (కెఎల్‌ఎఫ్) చీఫ్ హర్మీందర్ సింగ్ అలియాస్ మింటూను పోలీసులు పట్టుకున్నారు. నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో మింటూను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఆదివారం రాత్రి కెఎల్‌ఎఫ్ చీఫ్‌ను అరెస్టు చేసినట్టు ప్రత్యేక సెల్ పోలీసు కమిషనర్ అర్వింద్ దీప్ తెలిపారు. ‘జైలునుంచి తప్పించుకుపోయిన హర్మీందర్ సింగ్ ఢిల్లీ పారిపోయి ఉంటాడని అనుమానంతో అక్కడి పోలీసులను అప్రమత్తం చేశాం. పూర్తి నిఘా ఉంచి మొత్తానికి ఖలిస్తాన్ లిబరేషన్ నాయకుడి ఆచూకీ కనిపెట్టాం’ అని ఆయన వివరించారు. మింటూను తీసుకురావడానికి పంజాబ్ నుంచి ప్రత్యేక పోలీసు బృందం రంగంలోకి దిగింది. విచారణ నిమిత్తం అతడిని పంజాబ్ తీసుకెళ్తారని కమిషనర్ తెలిపారు. నభా జైలు కేసులో ఇప్పటికే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. దీనంతటికీ సూత్రధారి పర్మీందర్ సింగ్‌ను ఆదివారం సాయంత్రమే యూపీ పోలీసులు అరెస్టు చేశారు. యూపీలోని షాలీ జిల్లా కైరానాలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. టయోటా ఫార్ట్యునర్ వాహనంలో వెళ్తూ పర్మీందర్ దొరికిపోయాడు. మింటూతోపాటు తప్పించుకుపోయిన ఖైదీలకోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. కెఎల్‌ఎఫ్ చీఫ్ మింటూపై అనేక కేసులున్నాయి.

థాయ్‌లాండ్ నుంచి వచ్చిన అతడిని 2014 నవంబర్‌లో పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు.