జాతీయ వార్తలు

వెండితెరపై జెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 30: దేశవ్యాప్తంగా ప్రతి థియేటర్‌లోను సినిమా ప్రదర్శనకు ముందు జాతీయ గీతాన్ని తప్పనిసరిగా ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. జాతీయ గీతాన్ని ప్రసారం చేసేటప్పుడు స్క్రీన్‌పై జాతీయ పతాకం కనిపించాలని, ప్రేక్షకులందరూ లేచి నిలుచుని గౌరవాన్ని ప్రదర్శించాలని కూడా స్పష్టం చేసింది. మాతృదేశాన్ని ప్రేమించడం, గౌరవాన్ని ప్రదర్శించడం ప్రతి పౌరుడి కర్తవ్యమని, జాతీయ గీతాన్ని, అలాగే జాతీయ పతాకాన్ని గౌరవించినప్పుడు మాతృభూమి పట్ల గౌరవం, ప్రేమ ప్రదర్శితమవుతాయని కోర్టు స్పష్టం చేసింది. తాము ఒక దేశంలో నివసిస్తున్నామని, దేశ భక్తికి, జాతీయతకు చిహ్నమైన జాతీయ పతాకాన్ని గౌరవించడం తమ ప్రాథమిక కర్తవ్యమనే విషయాన్ని ప్రజలంతా గ్రహించాల్సిన సమయం వచ్చిందని న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, అమితావ రాయ్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించడం వల్ల ప్రజల్లో దేశభక్తి పెంపొందుతుందని కూడా బెంచ్ అభిప్రాయ పడింది. సినిమా హాలులో జాతీయ గీతాన్ని వినిపించేటప్పుడు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడడం కోసం హాలులో ఉన్న అన్ని ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల తలుపులను మూసి వేయాలని కూడా బెంచ్ స్పష్టం చేసింది. జాతీయ గీతాన్ని ఏ వ్యక్తి కూడా ప్రత్యక్షంగా, లేదా పరోక్షంగా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి అనుమతించరాదని కూడా బెంచ్ స్పష్టం చేసింది. అంతేకాదు, జాతీయ గీతాన్ని వేరే ఏ ఇతర రకాల కార్యక్రమంలో భాగంగా చేర్చకూడదని కూడా బెంచ్ స్పష్టం చేసింది. జాతీయ గీతాన్ని పూర్తిగా వినిపించాలని, సంక్షిప్తంగా వినిపించకూడదని కూడా బెంచ్ తన తీర్పులో స్పష్టం చేసింది. తన తీర్పును పది రోజుల్లో అమలు చేయాలని కూడా బెంచ్ స్పష్టం చేసింది.
సినిమా ప్రదర్శన ప్రారంభమయ్యే దానికి ముందు దేశవ్యాప్తంగా అన్ని సినిమా హాళ్లలోను జాతీయ గీతాన్ని వినిపించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ శ్యామ్‌నందన్ చౌక్సే అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం( పిల్)పై కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. కాగా, జాతీయ గీతాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించి తీరాల్సిందేనని, కోర్టు ఆదేశాలను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు పంపిస్తామని కేంద్రం తరఫున హాజరయిన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి బెంచ్‌కి హామీ ఇచ్చారు.