జాతీయ వార్తలు

జనశక్తికి పట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: పెద్ద నోట్ల రద్దుతో తమ ప్రభుత్వం జనశక్తికి పట్టంకట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఈ చారిత్రక నిర్ణయానికి ప్రజల మద్దతు ఉందని స్పష్టం చేసిన ఆయన, ప్రతిపక్షాల తీరును ఎండగట్టారు. రెండుసార్లు తాను రాజ్యసభకు హాజరైనా కూడా పెద్ద నోట్ల రద్దుపై చర్చకు విపక్షాలు అంగీకరించలేదని, ఆ విధంగా తమ అసలు స్వరూపాన్ని ఎండగట్టుకున్నాయని అన్నారు. బుధవారం బిజెపి పార్లమెంటరీ పార్టీలో మాట్లాడిన నరేంద్ర మోదీ గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు అసంబద్ధంగా ఉన్న పక్షంలో వాటిపై పార్లమెంట్‌లో చర్చ జరిగేదని, కానీ పెద్ద నోట్ల రద్దువంటి భారీ ఆర్థిక సంస్కరణ నిర్ణయంపై చర్చించడానికి విపక్షాలు అంగీకరించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశ వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ మీడియాకు వివరించారు. ఎన్నికల సమయంలో ప్రజలను ఓటర్ల లిస్టులో చేర్చినట్టుగానే నగదు రహిత లావాదేవీల గురించి, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రజల్లో అవగాహన కలిగించాలని సమావేశంలో పార్టీ ఎంపీలకు మోదీ పిలుపునిచ్చారన్నారు. అలాగే ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లో సరైన అవగాహన కలిగించాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలకూ ఉందన్న అభిప్రాయాన్ని మోదీ వ్యక్తం చేశారన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యశక్తి కంటే కూడా జనశక్తే గొప్పదన్న వాస్తవాన్ని ఉద్ఘాటించిన మోదీ, ఈ భావననే తాము తెరపైకి తెచ్చినట్టుగా కూడా సమావేశంలో వివరించారని అనంతకుమార్ తెలిపారు. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా పెద్దనోట్ల రద్దు నిర్ణయానికి ప్రజా మద్దతు ఉందన్న విషయాన్ని మోదీ పునరుద్ఘాటించారన్నారు. ఈ సందర్భంగా తన పిలుపును పురస్కరించుకున్న భారీ సంఖ్యలో ఎల్పీజీ సబ్సిడీకి ప్రజలు వదులుకున్న విషయాన్ని కూడా గుర్తు చేశారన్నారు. ఒకపక్క ఏడాదికి సబ్సిడీపై 9 సిలిండర్లు ఇవ్వాలా? 12 ఇవ్వాలా? అన్న అంశంపై చర్చ జరుగుతున్న సమయంలోనే సబ్సిడీని వదులుకునేందుకు లక్షల సంఖ్యలో ప్రజలు ముందుకు వచ్చిన విషయాన్ని మోదీ గుర్తు చేశారన్నారు. పెద్ద నోట్ల రద్దుపై చర్చించడానికి ప్రతిపక్షాలకు ఏమాత్రం ఆసక్తిలేదని పేర్కొన్న ఆయన ‘ఇప్పటి వరకూ క్రమశిక్షణాయుతంగా ఎంతో కష్టాన్ని ఓర్చుకున్న ప్రజలకు తాజా నిర్ణయ ప్రయోజనాలను మరింతగా తెలియజేయాల్సిన బాధ్యత మీది’ అంటూ ఎంపీలకు ఉద్భోదించారన్నారు. ఇప్పటివరకూ కూడా కేవలం అభ్యంతరం చెప్పడమే తప్ప పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏ ప్రధాన రాజకీయ పార్టీ కూడా డిమాండ్ చేయలేదని మోదీ పేర్కొన్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై చర్చించి ప్రభుత్వానికి మరిన్ని గుణాత్మకమైన సలహాలు, సూచనలను విపక్షాలు చేస్తే ఎంతో బావుండేదన్న అభిప్రాయాన్ని కూడా ప్రధాని వ్యక్తం చేశారన్నారు. మొదట్లో తాను రాజ్యసభకు రావాలని పట్టుబట్టిన విపక్షాలు, తాను రెండసార్లు హాజరైనా చర్చ నుంచి తప్పించుకున్నాయని కూడా మోదీ విమర్శించినట్టు తెలిపారు. విపక్షాల అసంబద్ధ ధోరణిని ఖండిస్తూ ఈ సమావేశంలో ఓ తీర్మానాన్ని చేపట్టారన్నారు. అలాగే ప్రజలు విస్తృతస్థాయిలో పెద్ద నోట్ల రద్దును సమర్థించినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నగదు రహిత, డిజిటల్ లావాదేవీలపై తమ మంత్రిత్వ శాఖ చేసిన కృషిని పెట్రోలియం, సహాజవాయువుల శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు. అలాగే తమ రాష్ట్రంలో 60 శాతానికి పైగా నగదు రహిత లావాదేవీలను పెంపొందించేందుకు చేపట్టిన చర్యల గురించి గోవా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కూడా వివరించారు.

చిత్రం... బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీనియర్ నాయకుడు ఎల్‌కె అద్వానీ,
మంత్రులు రాజ్‌నాథ్, పారికర్ తదితరులతో కలిసి కూర్చున్న ప్రధాని నరేంద్ర మోదీ