జాతీయ వార్తలు

వందకోట్ల నల్లధనాన్ని మార్చుకున్న గాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బళ్లారి, డిసెంబర్ 7: గనుల అక్రమ తవ్వకాలకు పాల్పడినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న మైనింగ్ దిగ్గజం గాలి జనార్ధన్ రెడ్డి ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. కర్ణాటక రాష్ట్ర మాజీ మంత్రి కూడా అయిన గాలి రద్దయిన పాత పెద్ద నోట్లలో ఉన్న రూ.100 కోట్ల నల్ల ధనాన్ని తెల్ల ధనంగా మార్చుకున్నట్టు అతని వద్ద డ్రైవర్‌గా పనిచేసిన రమేశ్ గౌడ తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్టు సమాచారం. కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి భీమా నాయక్‌కు 20 శాతం కమిషన్ ఇచ్చి, అతని సహాయంతో లెక్క చూపని తన రూ.100 కోట్లను జనార్ధన్ రెడ్డి తెల్లధనంగా మార్చుకున్నారని రమేశ్ గౌడ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రాసిన లేఖలో పేర్కొన్నట్టు బుధవారం వార్తలు వ్యాపించాయి. జనార్ధన్ రెడ్డి తనను మానసికంగా తీవ్రంగా వేధించాడని, అందువల్లనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని రమేశ్ గౌడ తన సూసైడ్ నోట్‌లో రాశాడు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో కోట్లాది రూపాయల గనుల తవ్వకాలలో అవినీతికి పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న గాలి ఇప్పటికే మూడు సంవత్సరాల నాలుగు నెలలపాటు జైలు జీవితం గడిపారు. షరతులతో కూడిన బెయిలుపై బయటకు వచ్చిన ఆయన ఈ నెల 16న తన కుమార్తె బ్రహ్మణి వివాహాన్ని అట్టహాసంగా నిర్వహించడం వివాదాస్పదమయింది. ఈ వివాహంకోసం రూ.500 కోట్లు వ్యయం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఒకవైపు మార్కెట్‌లో 85 శాతం చలామణిలో ఉన్న నోట్లను రద్దు చేయడం వల్ల దేశవ్యాప్తంగా ప్రజలు నగదు కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ గాలి తన కుమార్తె వివాహానికి కోట్లాది రూపాయలు వ్యయం చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఆదాయపు పన్ను శాఖ అధికారులు అతనికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీపై దాడులు నిర్వహించారు.