జాతీయ వార్తలు

తీరు మారని లోక్‌సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: నాలుగు రోజులుగా లోక్‌సభలో కొనసాగుతున్న ప్రతిష్టంభన బుధవారం కూడా కొనసాగింది. పెద్ద నోట్ల రద్దు మూలంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి టిఆర్‌ఎస్ పక్ష నాయకుడు జితేందర్ రెడ్డి 193 కింద ఇచ్చిన నోటీసుపై చర్చ జరిపేందుకు స్పీకర్ సుమిత్రా మహాజన్ చేసిన ప్రయత్నాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాల సభ్యులు నినాదాలతో దెబ్బతీశారు. స్పీకర్ అనుమతి మేరకు జితేందర్‌రెడ్డి మాట్లాడటం ప్రారంభించగానే ప్రతిపక్ష సభ్యులు ముఖ్యంగా తృణమూల్ సభ్యులు ఆయనను చుట్టుముట్టి పెద్దఎత్తున నినాదాలిచ్చారు. జితేందర్ రెడ్డి మైక్ వైపు వంగి భయంకరంగా అరిచారు. స్పీకర్ ఎన్నిసార్లు హెచ్చరించినా వారు వినిపించుకోలేదు. జితేందర్‌రెడ్డి టిఎంసి సభ్యుల నినాదాల మధ్యనే తన ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేస్తూ ధైర్యంగా తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నామని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ పూర్తిగా సమర్థించారన్నారు. ఈ దశలో తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ సభ్యులు ఆయన మైక్‌ను తమ వైపు తిప్పుకుని సభ దద్దరిల్లేలా నినాదాలు ఇచ్చారు. దీనితో సుమిత్రా మహాజన్ సభను రేపు ఉదయం వరకు వాయిదా వేశారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమం సమయంలో కూడా ప్రతిపక్ష సభ్యులు పోడియం వద్దకు వచ్చి గొడవ చేశారు. అయితే స్పీకర్ మాత్రం ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కొనసాగించి సభను వాయిదా వేశారు. లోక్‌సభ తిరిగి సమావేశమైన తరువాత కూడా ఇదే తంతు కొనసాగింది. ప్రతిపక్షం సభ్యుల నినాదాల హోరులోనే సావధాన తీర్మానాలపై చర్చ జరిపిన అనంతరం సభను వాయిదా వేశారు.