జాతీయ వార్తలు

గీతను తల్లిదండ్రులకు అప్పగిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, డిసెంబర్ 30: మూగ, చెవిటి అమ్మాయి గీతను తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోందని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. పదేళ్ల క్రితం తప్పిపోయి పాకిస్తాన్‌లో ప్రవేశించిన గీతను అక్టోబర్ 26న భారత్‌కు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పాక్‌లోనే ఓ స్వచ్ఛంద సంస్థ వద్ద ఆశ్రయం పొందిన ఆమెను కేంద్రం స్వదేశానికి తీసుకొచ్చింది. గీత తల్లిదండ్రుల ఆచూకీకోసం ప్రయత్నిస్తున్నామని మంత్రి తెలిపారు. స్థానికంగా నడుస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థలో ప్రస్తుతం గీత ఉంటోంది. మంగళవారం రాత్రి ఇక్కడకు వచ్చిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఓ హోటల్‌లో గీతను కలుసుకున్నారు. ఆమెను చూడగానే భావోద్వేగానికి గురైన మంత్రి ఒక్కసారిగా ఆలింగనం చేసుకున్నారు. 30 నిముషాల సేపు అక్కడే గడిపిన సుష్మ ‘గీత తల్లిదండ్రుల ఆచూకీకోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తల్లిదండ్రులు ఎక్కడున్నదీ తెలుసుకుని ఆమెను వారి వద్దకు పంపుతాం’ అని అన్నారు. స్వచ్ఛంద సంస్థలో గీత అల్లిక పనులు నేర్చుకుంటోంది. వస్త్రంపై గీత అల్లిక పనులు చూసిన విదేశాంగ మంత్రి అబ్బురం చెందారు. ఈ నెల 18న సుష్మా గీత ఫోటోలు వివరాలతో ట్వీట్ చేశారు. తమ అమ్మాయే అంటూ పలువురు ముందుకొస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఆధారాలతోసహా రావాలని మంత్రి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మంగళవారం మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాకు చెందిన 40ఏళ్ల మహిళ తానే గీత తల్లినంటూ ప్రకటించింది. అనీసా బీ అనే ఆమె గీత తమ కూతురేనంటూ, ఆమెను కలవడానికి అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేసుకుంది. తమ కుమార్తె పేరు నజ్జో అని పేర్కొంటూ నర్సింగపూర్ జిల్లా గొటేగావ్‌లో 13 ఏళ్ల క్రితం తప్పిపోయిందని అనీసా పేర్కొంది. తప్పిపోయిన కుమార్తె పాస్‌పోర్టు సైజ్ ఫొటోను జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ అశీష్ సింగ్‌కు అందచేసింది. ఆమె దరఖాస్తును సామాజిక న్యాయ మంత్రిత్వశాఖకు పంపినట్టు కలెక్టర్ వెల్లడించారు. గీత తమ కుమార్తె అని, ఆమెను కలవడానికి అనుమతి కోరుతూ ఇంతకుముందు నాలుగు దరఖాస్తులు వచ్చాయన్నారు. నవంబర్‌లో బీహార్‌కు చెందిన మహతో కుటుంబం కూడా గీత తమ కూతురేనంటూ చెప్పడంతో డిఎన్‌ఏ పరీక్షలు జరిపారు. అయితే డిఎన్‌ఏ నివేదికలో వారు గీత కుటుంబీకులు కాదని తేలింది. గీత అసలు పేరు హీరా అని 2004లో ఓ జాతరలో తప్పిపోయిందని మహతో చెప్పుకొచ్చాడు. గీత కూడా తన తల్లిదండ్రులు ఎవరో చెప్పలేకపోతోంది.

పాక్ నుంచి భారత్ చేరుకున్న గీతను ఆశీర్వదిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ (ఫైల్ ఫొటో)