జాతీయ వార్తలు

ప్రచారమే తప్ప.. ప్రజా సమస్యలు పట్టవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: ప్రతిపక్షం టీవీలు, పత్రికల్లో ప్రచారం సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తోంది తప్ప ప్రజల సమస్యల గురించి చర్చ జరిపేందుకు ఇష్టపడటం లేదని రాజ్యసభ నాయకుడు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దుయ్యబట్టారు. బుధవారం లోక్‌సభ జీరో అవర్‌లో కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ పెద్దనోట్ల రద్దుమూలంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై లేవనెత్తిన అంశాలకు జైట్లీ సమాధానం ఇస్తూ ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోశారు. ‘ప్రతిపక్షం రాజ్యసభలో ప్రతిరోజూ ఇదే విధంగా చేస్తోంది. పూర్తిస్థాయి చర్చ జరిపేందుకు ఎందుకు అంగీకరించటం లేదు? ప్రజల సమస్యల పట్ల అంతగా బాధ ఉంటే ఇప్పుడు వెంటనే చర్చను కొనసాగించాలి’ అని ఆయన ప్రతిపక్షాన్ని సవాల్ చేశారు. రాజ్యసభ సమావేశాలు ప్రారంభమైన రోజే పెద్దనోట్ల రద్దుపై చర్చ జరగాలని ప్రతిపక్షం డిమాండ్ చేయగానే ప్రభుత్వం వెంటనే ఒప్పుకున్నదని, ఆ రోజంతా చర్చ జరిగిందనేది మరిచిపోరాదని అన్నారు. ప్రతిపక్షం రెండోరోజు మనసు మార్చుకోవటం వల్లనే చర్చ ఆగిపోయింది. ప్రధాని సభకు వస్తేనే చర్చ ముందుకు సాగుతుందన్నారు. ప్రధాని సభకు వచ్చారు, ఆయన చర్చలో పాల్గొంటారని కూడా చెప్పాము, అయినా చర్చను ఎందుకు కొనసాగనివ్వటం లేది జైట్లీ ప్రశ్నించారు. చర్చ సందర్భంగా చెప్పవలసిన అంశాలను జీరో అవర్‌లో ఎలా చెబుతారని ఆయన ప్రతిపక్షాన్ని నిలదీశారు.
ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ పెద్దనోట్లను రద్దు చేసి నెల రోజులు కావస్తున్నా బ్యాంకులు, ఏటిఎంలలో డబ్బు ఎందుకు లభించటం లేదని ప్రశ్నించారు. నోట్లకోసం బ్యాంకుల్లో నిలబడి 84 మంది మరణించారని, వీరి మరణానికి ఎవరు బాధ్యత వహిస్తారని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ముందు వెనకా ఆలోచించకుండా పెద్దనోట్లను రద్దు చేసిందని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాలోని ఏటిఎంలలో డబ్బు పెట్టటం లేదని దుయ్యబట్టారు. బజారులో ఉన్న మొత్తం డబ్బు వెనకకు రావాలని రెవెన్యూ కార్యదర్శి చెబుతున్నారు, ఇదే నిజమైతే ఇక నల్ల ధనం ఎక్కడున్నదని ఆజాద్ ప్రశ్నించారు. కాంగ్రెస్ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో అన్ని బ్యాంకులు, ఏటిఎంలలో సరిపడా డబ్బు ఉన్నట్లు చెప్పారని, ఇదే నిజమైతే ప్రజలు పెద్ద సంఖ్యలో క్యూలో ఎందుకు నిలబడుతున్నారని ఆయన ప్రశ్నించారు. బిఎస్‌పి అధ్యక్షురాలు మాయావతి మాట్లాడుతూ ప్రభుత్వం తొందరపాటు నిర్ణయం వలన ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని దుయ్యబట్టారు. ఆజాద్, జైట్లీ, మాయావతి తదితరులు మాట్లాడిన అనంతరం జరిగిన గొడవ మూలంగా సభ పనె్నండు గంటల వరకు వాయిదా పడింది. సభ పనె్నండు గంటలకు సమావేశమైనప్పుడుకూడా కేవలం ఐదు నిమిషాలు మాత్రమే పని చేసేంది. పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేకపోవడంతో కురియన్ సభను గురువారానికి వాయదా వేశారు.

చిత్రం... రాజ్యసభలో బుధవారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిస్తున్న విపక్షం సభ్యులు