జాతీయ వార్తలు

రూ. 149కే ఇంటర్నెట్, టీవీ కనెక్షన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,డిసెంబర్ 10: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఫైబర్ గ్రిడ్‌ను ప్రారంభించడం ద్వారా ప్రజలకు అతి చౌకగా ఇంటర్నెట్, టీవీ, టెలిఫోన్ కనెక్షన్లను అందిస్తుందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి చెప్పారు. కేవలం 149 రూపాయలకే ఈ సదుపాయాలను అందజేయనున్నట్లు ఆయన చెప్పారు. పరిపాలన, సంక్షేమ పథకాలను అమలులో పారదర్శకత కోసం సమాచార సాంకేతిక పరిజ్ఞానం, అంతర్జాలాన్ని ఉపయోగించటంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన ప్రకటించారు. రఘునాథరెడ్డి శనివారం రాష్ట్రాల సమాచార శాఖల మంత్రుల 28వ సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసిన సంక్షేమ, అభివృద్ది పథకాల గురించి ప్రజలకు తెలియజేయటంలో సమాచార శాఖ అత్యంత కీలక పాత్ర నిర్వహించిందన్నారు. రాష్ట్రంలోని 29 వేల ప్రజాపంపిణీ దుకాణాల్లో ఈ-పోస్ వ్యవస్థను ప్రారంభించటం ద్వారా నగదు రహిత విధానాన్ని ప్రోత్సహిస్తోందని ఆయన వివరించారు. డెబిట్ కార్డులు, రుపీ కార్డులను రైతులు, రైతు కూలీలు కూడా ఉపయోగించేలా చేస్తున్నామని రఘునాథరెడ్డి చెప్పారు. కమాండ్,కంట్రోల్ వ్యవస్థ ద్వారా నేరగాళ్లను అదుపు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రాథమిక విద్యలో ఈ-లర్నింగ్ కేంద్రాలు, ఈ-తరగతులను ఏర్పాటు చేస్తున్నామని రఘునాథ రెడ్డి తెలిపారు. ఈ-విద్యావ్యాప్తికి రాష్ట్ర విద్యా శాఖకు ప్రత్యేక టీవీ చానల్ అవసరమని ఆయన సూచించారు. రాష్ట్రానికి కమ్యూనిటీ రేడియోల సంఖ్య కూడా పెంచాలన్నారు.