జాతీయ వార్తలు

కొత్త నోట్ల గుట్టలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నాటకలో బయటపడిన 5.7 కోట్ల కరెన్సీ
సీనియర్ నటుడి అల్లుడే హవాలా వ్యాపారి
బాత్‌రూమ్ గోడలో స్టీల్ బీరువాలు
32 కిలోల బంగారు బిస్కెట్లూ స్వాధీనం
చెన్నై పన్ను ఎగవేత కేసులో కొత్త కోణం
మరో రూ.24 కోట్ల కొత్త నోట్ల కట్టలు స్వాధీనం
తపాల అధికారి బంధువు ఇంట్లో సిబిఐ సోదాలు
రూ.70 లక్షల కొత్త కరెన్సీ పట్టివేత
షాద్‌నగర్‌లో 82 లక్షల కొత్త కరెన్సీ

ఒక్క నోటు కోసం ఒంటికాలిపై గంటలకొద్దీ కొంగజపం చేస్తున్న సామాన్య భారతం ఒకవైపు.. కదిపితే గుట్టలుగా జారిపడుతున్న కొత్త నోట్ల కట్టల రాబందులు మరోవైపు.. పెద్ద నోట్ల రద్దు తరువాత దేశంలో కనిపిస్తున్న విచిత్ర దృశ్యమిది. పెద్ద నోటును వెనక్కి తీసుకున్న తరువాత ప్రజావసరాలు తీర్చేందుకు ఆర్బీఐ విడుదల చేసిన కొత్త నోట్ల కట్టలు సామాన్యుడి కంటపడక ముందే నల్లనోటీశ్వరుల నోట్లలోకి పోయాయని చెప్పడానికి -రోజుకొక్కటిగా బయటపడుతున్న సంఘటనలే పెద్ద ఉదాహరణ. హవాలాల దెబ్బకు కనుమరుగైపోయిన కొత్త కరెన్సీని వెతికిపట్టేందుకు రంగంలోకి దిగుతున్న దర్యాప్తు విభాగాలే -కట్టలూడుతున్న నోట్ల కట్టలను చూసి కంగారుతో గుండెలమీద చేతులు వేసుకుంటున్న దృశ్యాలు అవినీతి భారతంలో స్పెషల్ ఎఫెక్ట్‌గా కనిపిస్తున్నాయి. బ్యాంకులకు మూడు రోజులు సెలవు రావడంతో -శనివారం ఉదయం నుంచే ‘పుట్ట’లపై దృష్టి పెట్టిన ఐటి విభాగాలకు పెద్ద పాములు దొరికిపోయాయి. కరెన్సీని దాస్తున్న విధానం, ప్రదేశం, వ్యూహాలను చూసి అధికారులే కంగారుపడుతున్నారు. బాత్రూంలోని సీక్రెట్ స్టీల్ బీరువాలో కొత్త కట్టలు దాచిన ఘనుడు ఒకరైతే, అధికారులకు అనుమానం రాకుండా ఆరుబయట కారులోనే కోట్ల కట్టలు వదిలేసిన ఘనుడు మరొకరు. వివరాల్లోకి వెళ్తే.. కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లా చెల్లకెరెలోని హవాలా వ్యాపారి ఇంట్లో జరిపిన దాడుల్లో భారీగా కొత్త కరెన్సీ, బంగారం దొరికింది. బాత్రూంలోని వాష్ బేసిన్‌కు పైన టైల్స్‌వెనుక రహస్యంగా ఏర్పాటు చేసిన స్టీల్ బీరువా తెరిచినపుడు 5.7 కోట్ల నగదు, 32 కిలోల బంగారం బిస్కట్లు జారిపడ్డాయి. మార్చాల్సిన రూ.90 లక్షల పాతనోట్లూ లభించాయి. కన్నడ సీనియర్ నటుడు దొడ్డణ్ణ అల్లుడు వీరేంద్రే హవాలా వ్యాపారిగా అనుమానిస్తున్నారు.
చెన్నైలో గత రెండు రోజుల క్రితం లెక్కల్లోలేని రూ.142 కోట్ల నగదు, భారీగా బంగారం పట్టుకున్న ఐటి విభాగాలు, శనివారం తాజాగా మరో 24కోట్ల కొత్త నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంటరాగేషన్‌లో ఉన్న ఒక వ్యక్తి అందించిన సమాచచారంతో వెల్లూరులోని ఒక కారు నుంచి స్వాధీనం చేసుకున్నారు.
ఇక హైదరాబాద్‌లో తపాల, బ్యాంకు అధికారుల చేతివాటం బయటపడిన విషయం తెలిసిందే. గోల్కొండ తపాల కార్యాలయంలో సీనియర్ సూపరింటెండెంట్ సుధీర్‌బాబును కరెన్సీ అక్రమాల కేసులో అదుపులోకి తీసుకున్న సిబిఐ, శనివారం ఇబ్రహీంపట్నంలోని సమీప బంధువు తులసీరాంనాయక్ ఇంట్లో సోదాలు జరిపి రూ. 70 లక్షల కొత్త కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. మరో మూడు కోట్ల పాత నోట్లూ పట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్న తులసీరామ్ నాయక్ స్థానికంగా ఆటోడ్రైవర్‌గా పని చేస్తుండటం విశేషం. సుధీర్‌బాబు మూడు పోస్ట్ఫాసుల్లో 3 కోట్ల మేర పాత నోట్లు మార్చినట్టు సిబిఐ వెల్లడించటం తెలిసిందే. అదేవిధంగా పోలీసుల తనిఖీల్లో 82.21 లక్షల కొత్త, పాత కరెన్సీ పట్టుబడినట్లు రంగారెడ్డి జిల్లా కొత్తూరు రూరల్ సిఐ మధుసూదన్ తెలిపారు. శుక్రవారం రాత్రి కొత్తూరు బైపాస్ 44వ జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేస్తుండగా కరెన్సీ తరలిస్తున్న కారు, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు.