జాతీయ వార్తలు

శేఖర్‌రెడ్డి పన్ను ఎగవేత కేసు.. మరో రూ.24 కోట్లు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 10: పెద్ద నోట్ల రద్దు అనంతరం చెన్నైలో గత కొద్ది రోజుల నుంచి వరుసగా దాడులు నిర్వహిస్తూ పెద్ద మొత్తంలో బంగారాన్ని, లెక్కలో లేని రూ.142 కోట్ల నగదును పట్టుకున్న ఆదాయ పన్ను (ఐటి) విభాగం అధికారులు శనివారం తాజాగా మరో 24 కోట్ల రూపాయల కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా పట్టుబడిన సొమ్మంతా కొత్త 2000 రూపాయల నోట్ల రూపంలోనే ఉందని, ప్రస్తుతం ఇంటరాగేషన్‌లో ఉన్న ఒక వ్యక్తి వెల్లడించిన సమాచారం మేరకు ఆదాయ పన్ను అధికారులు వెల్లూరులో ఒక కారు నుంచి ఈ నగదును స్వాధీనం చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. దీంతో ఈ ఒక్క కేసులోనే ఇప్పటివరకూ పట్టుబడిన నగదు 166 కోట్ల రూపాయలకు పెరిగింది. పన్ను ఎగవేతలను అరికట్టేందుకు చెన్నైలోని వివిధ ప్రాంతాల్లో దాడులను నిర్వహిస్తున్న ఐటి అధికారులు గత రెండు రోజుల్లో 10 కోట్ల రూపాయల కొత్త నోట్లు సహా రూ.142 కోట్ల అప్రకటిత సొమ్మును, 127 కిలోల బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. తమిళనాడులో ఇసుక తవ్వకాలు జరుపుతున్న ఒక గ్రూపు కార్యాలయాలు, ఇళ్లపై ఐటి అధికారులు గురువారం నుంచి దాడులు ప్రారంభించి వీటిని పట్టుకున్నారు. గత నెల 8వ తేదీన కేంద్ర ప్రభుత్వం పాత 500, 1000 రూపాయల నోట్ల చెలామణిని రద్దు చేసిన తర్వాత దేశంలో అత్యధిక మొత్తంలో పట్టుబడిన కొత్త కరెన్సీ ఇదే. తమిళనాడు రాష్ట్రం అంతటా ఇసుక తవ్వకాలు జరిపేందుకు లైసెన్సు కలిగివున్న ఈ గ్రూపు కార్యాలయాలు, ఇళ్లపై ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి 96.89 కోట్ల రూపాయల పాత పెద్ద నోట్లు, మరో రూ.9.63 కోట్ల కొత్త 2000 నోట్లతో పాటు సుమారు 36.29 కోట్ల రూపాయల విలువచేసే 127 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని, ఇవన్నీ అప్రకటిత ఆస్తులేనని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) న్యూఢిల్లీలో విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ సోదాల్లో పట్టుబడిన సొమ్ము, బంగారం అంతా తన సొంతదేనని తమిళనాడు ప్రభుత్వంతో కలసి పనిచేస్తున్న శేఖర్ రెడ్డి అనే కాంట్రాక్టర్ చెబుతున్నట్లు సిబిడిటి వెల్లడించింది.