జాతీయ వార్తలు

ఉపన్యాసాలే తప్ప పరిష్కారం శూన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, డిసెంబర్ 10: పెద్దనోట్ల రద్దుతో ప్రజల సమస్యలు తీర్చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఉపన్యాసాలు దంచడమే తప్ప వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరుగుతోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు.‘ మోదీ వేదికలెక్కి ప్రసంగాలు చేయడమే..జనానికి ఏమాత్రం ఉపశమనం కలగడంలేదు’అని శనివారం ఆమె ధ్వజమెత్తారు. 500.1000 రూపాయల నోట్ల రద్దు నిర్ణయం వికటించిందని మోదీ బాబాకు తెలుసని ఆమె అన్నారు.
గుజరాత్‌లోని బనసకాంతలో ప్రధాని ఉపన్యాసాన్ని ఎద్దేవా చేస్తూ మమత ట్వీట్ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన ప్రధాని మోదీ రాజీనామా చేయాలని గురువారం మమత డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ తొందరపాటు నిర్ణయం వల్ల దేశం భారీ మూల్యం చెల్లించుకోవల్సి వచ్చిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద కరెన్సీ రద్దుతో వ్యాపారం ఘోరంగా దెబ్బతిందని, అభివృద్ధి ఊసేలేదని మమత విమర్శించారు. దేశానికి ఏది మేలో ఏది కీడో అర్థం చేసుకునే పరిస్థితిలో మోదీ లేరని, ఒకరు చెప్పినా అర్థం చేసుకోవడం లేదని తృణమూల్ అధినేత్రి విరుచుకుపడ్డారు.

శబరిమల ఆలయంలో స్వల్ప ప్రమాదం

నలుగురికి గాయాలు
శబరిమల, డిసెంబర్ 10: కేరళలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో స్వామి ప్రసాదం ‘అరవాణ’(బెల్లం, బియ్యంతో తయారుచేసే ప్రసాదం) తయారీ ప్లాంట్‌లో శనివారం ఉదయం జరిగిన స్వల్ప ప్రమాదంలో నలుగురికి కాలిన గాయాలయ్యాయి. ప్రసాదాన్ని తీసుకెళ్లే హైప్రెషర్ పైప్‌లో లీక్ కారణంగా ఈ నలుగురికి కాలిన గాయాలయ్యాయని పోలీసులు చెప్పారు. గాయాలయిన నలుగురిని ఆస్పత్రిలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు.