జాతీయ వార్తలు

నగదురహిత లావాదేవీలకు నీతి ఆయోగ్ అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: నగదు లేకుండా డిజిటల్ లావాదేవీలు నిర్వహించే వారికి అవార్డులు ఇవ్వాలని నీతి ఆయోగ్ నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఒక పథకాన్ని రూపొందించాలని జాతీయ చెల్లింపుల కార్పొరేషన్‌ను కోరింది. ఈ అవార్డులు పొందటానికి అర్హతలను నీతి ఆయోగ్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
* డిజిటల్ చెల్లింపులు జరిపే అందరు వినియోగదారులు, వ్యాపారులు ఈ పథకం కింద అవార్డులు పొందేందుకు అర్హులే.
* ఇందులో రెండు రకాల ప్రోత్సాహకాలు ఉంటాయి.
* చెల్లింపులు జరిపిన తరువాత వచ్చే ట్రాన్సాక్షన్ ఐడి లను లక్కీడ్రా చేసి విజేతలకు ప్రోత్సాహకాలు ఇస్తారు.
* మూడు నెలల కోసారి లక్కీడ్రా తీసి గ్రాండ్ ప్రైజ్‌ను ప్రకటిస్తారు.
* ఈ పథకం రూపకల్పన ప్రధానంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు, చిన్న వ్యాపారులను దృష్టిలో ఉంచుకుని చేస్తారు.
* యుఎస్‌ఎస్‌డి, ఏఈపిఎస్, యుపిఐ, రూపే కార్డుల ద్వారా చెల్లింపులు జరిపే వారంతా ఈ అవార్డులకు అర్హులే.
* పిఓఎస్ మిషన్లను ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేసే వారిని ఈ అవార్డులకు పరిగణలోకి తీసుకుంటారు.
* ఈ పథకానికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలు త్వరలో వెల్లడిస్తారు.
* నవంబర్ 8తరువాత జరిపిన అన్ని డిజిటల్ లావాదేవీలను అవార్డులకు అర్హమైనవిగా స్వీకరిస్తారు.
* రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రభుత్వ రంగ సంస్థలు, జిల్లా, పట్టణ, గ్రామ స్థానిక సంస్థలకు తగిన గుర్తింపునిచ్చేందుకు కూడా ఈ పథకాన్ని వినియోగిస్తారు.