జాతీయ వార్తలు

పెరుగుతున్న అసహనం .. నరకంగా మారిన నగదు కొరత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 10: చేతిలో డబ్బు లేక అల్లలాడుతున్న ప్రజలను శనివారం నుంచి వరుసగా మూడు రోజులు వచ్చిన సెలవులు మరింత కుంగదీస్తున్నాయి. చెలామణిలోని 85 శాతం నోట్లను రద్దు చేసి నెల రోజులు గడిచినా ఇప్పటికీ నగదు కొరత తీరలేదు. ఎటిఎంలు పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. ఒకటి అరా అక్కడక్కడా పనిచేసినా వాటిల్లో పెట్టిన నగదు కొద్ది సేపట్లోనే అయిపోతోంది. అప్పటి వరకు భారీ క్యూలలో నిలబడి ఉన్నవారు ఉసూరుమంటూ డబ్బు చేతికి రాకుండానే తిరిగి వెళ్లిపోతున్నారు. దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబయి నగరంలో వారంతపు సెలవు దినమైన శనివారం కూడా ప్రజలు తమ అవసరాల కోసం బ్యాంకుల్లో ఉన్న తమ డబ్బును తీసుకోలేకపోయారు. బ్యాంకులకు శని, ఆది, సోమవారాలు సెలవు కావడంతో మార్కెట్‌లో నగదు సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అనేక ఎటిఎంలు పనిచేయకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా ఎటిఎంలలో ‘ఎటిఎం క్లోజ్డ్’ అనో, ‘నో క్యాష్’ అనో ప్లకార్డులు వేలాడదీసి ఉంటున్నాయి. పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రభుత్వాన్ని తొలినాళ్లలో సమర్థించిన వారు కూడా ఇప్పుడు సామాన్య ప్రజలకు డబ్బు అందుబాటులో లేకపోవడం, మరోవైపు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు, పోలీసులు చేస్తున్న దాడుల్లో పెద్ద మొత్తంలో కొత్త నోట్లు దొరుకుతుండటంతో తమ సహనం కోల్పోతున్నారు. ‘ఇది నిజంగా దిగ్భ్రాంతి కలిగిస్తున్న సిగ్గుపడవలసిన అంశం. రూ. 2వేలు, రూ. పది వేల కోసం సామాన్యులు ఎటిఎంల వద్ద, బ్యాంకుల వద్ద క్యూలలో నిలబడి చనిపోతున్నారు. మరోవైపు, రూ. 60 కోట్లు, రూ. 80 కోట్లు, ఆపైన.. ఇలా పెద్ద మొత్తంలో కొత్త కరెన్సీ కొంత మంది వద్ద పోగవుతోంది. ఇన్ని కొత్త నోట్లు వారికి ఎక్కడి నుంచి వస్తున్నాయి. బ్యాంకు అధికారులతో కుమ్మక్కు కాకుంటే వారికి ఇంత భారీ మొత్తంలో కొత్త నోట్లను పొందడం సాధ్యమవుతుందా?’ అని ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఇండియన్ బ్యాంక్‌లో గతంలో పనిచేసిన ఒక అధికారి శనివారం ఇక్కడ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రధానిని ఎవరూ
అడ్డుకోవడం లేదు

ఆయన సభలో ఉండాలని మాత్రమే కోరుతున్నాం
మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎదురుదాడి

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: నోట్ల రద్దు వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ శనివారం ఆరోపిస్తూ, పార్లమెంటులో మాట్లాడకుండా ఆయనను ఎవరూ ఆడ్డుకోవడం లేదని, ఈ కీలక అంశంపై చర్చ జరిగేటప్పుడు సభలో ఆయన ఉండాలని మాత్రమే ప్రతిపక్షం డిమాండ్ చేస్తోందని స్పష్టం చేసింది. లోక్‌సభలో ప్రతిపక్షం తనను మాట్లాడనివ్వడం లేదని, అందుకే తాను జనం ముందుకు వచ్చి చెప్పదలచుకున్నది చెప్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం గుజరాత్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో చెప్పడం తెలిసిందే. ప్రధాని వ్యాఖ్యలను కాంగ్రెస్ ప్రతినిధి ఆనంద్ శర్మ తప్పుబడుతూ, అవాస్తవాలు చెప్పడం ప్రధాని మోదీకి అలవాటని అన్నారు. అంతేకాదు నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రధాని ప్రకటించే సమయానికే రాష్టప్రతి పార్లమెంటు శీతాకాల సమావేశాల ఏర్పాటును ప్రకటించి ఉన్నారని ఆయన అంటూ, అలాంటప్పుడు నోట్ల రద్దు నిర్ణయాన్ని పార్లమెంటులోనే ప్రకటించడం కోసం ప్రధాని ఎందుకు వేచి ఉండలేదని ప్రశ్నించారు. ‘ప్రధానికి అవాస్తవాలు చెప్పడం అలవాటు. పార్లమెంటులో ప్రధాని మాట్లాడకుండా ఎవరూ అడ్డుకోవడం లేదు. ఆయన ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదు. మేము చెప్పే మాట కూడా వినాలని, చర్చలో పాల్గొని మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని మాత్రమే ప్రతిపక్షం కోరుతోంది. ఎందుకంటే నోట్ల రద్దు అపకటన చేసింది ఆయనే’ అని ఆనంద్ శర్మ అన్నారు. అంతేకాదు నవంబర్ 16న పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కనుక నోట్ల రద్దు ప్రకటన చేసేందుకు పార్లమెంటు ప్రారంభమయ్యే దాకా ప్రధాని వేచి ఉంటే ఏమయ్యేదని ఆనంద్ శర్మ అన్నారు. అంతేకాదు నోట్ల రద్దుపై ప్రధాని పార్లమెంటులో ఒక్కసారయినా మాట్లాడారా అని కూడా ఆయన ప్రశ్నించారు.

20న డిఎంకె జనరల్
కౌన్సిల్ సమావేశం
తాజా రాజకీయ పరిస్థితిపై సమీక్ష
చెన్నై, డిసెంబర్ 10: డిఎంకె పార్టీ అత్యున్నత నిర్ణాయకమండలి అయిన జనరల్ కౌన్సిల్ ఈ నెల 20న ఇక్కడ సమావేశమవుతోంది. ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రధాన ప్రత్యర్థి అయిన అన్నాడిఎంకె చేతిలో పరాజయం పాలయిన తర్వాత డిఎంకె జనరల్ కౌన్సిల్ సమావేశం కావడం ఇదే తొలిసారి. పార్టీ నిర్మాణాత్మక కార్యకలాపాలపై చర్చించేందుకు పార్టీ ప్రధాన కార్యాలయమైన అన్నా అరివాలయంలో జరిగే ఈ సమావేశానికి పార్టీ అధినేత ఎం కరుణానిధి అధ్యక్షత వహిస్తారని డిఎంకె ప్రధాన కార్యదర్శి కె అన్బళగన్ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. డిఎంకె కోశాధికారి, కరుణానిధి కుమారుడు ఎంకె స్టాలిన్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో జనరల్ కౌన్సిల్ సమావేశమవుతుండడం గమనార్హం. అలాగే జయలలిత మృతి, అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపైన కూడా సమీక్ష నిర్వహించనుంది.

‘అమ్మ’కు భారత రత్న ఇవ్వాలి

తమిళనాడు కేబినెట్ తీర్మానం

చెన్నై, డిసెంబర్ 10: తమిళనాడు రాజకీయాల్లో చెరిగిపోని ముద్ర వేసి కోట్లాది ప్రజల హృదయాల్లో అమ్మగా చిరస్థాయిగా నిలిచిపోయిన రాష్ట్ర ముఖ్యమంత్రి, దివంగత జయలలితకు ఈ దేశ అత్యున్నత పురస్కారమైన భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ తమిళనాడు మంత్రివర్గం శనివారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
అంతేకాకుండా పార్లమెంటు కాం ప్లెక్స్‌లో ఆమె నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేయాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. నగరంలోని మెరీనా బీచ్‌లో ఎంజిఆర్ మెమోరియల్ స్థలంలో జయలలితను ఖననం చేసిన చోట 15 కోట్ల రూపాయల వ్యయంతో ఒక మెమోరియల్‌ను ఏర్పాటు చేయాలని కూడా మంత్రివర్గం ప్రతిపాదించింది. అలాగే ఎంజిఆర్ మెమోరియల్ పేరును పురచ్చి తలైవర్ ఎంజిఆర్, పురచ్చి తలైవి అమ్మ సెల్వి జె జయలలిత మెమోరియల్‌గా మార్చాలని కూ డా మంత్రివర్గం తీర్మానించినట్లు సమావేశం అనంతరం విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటన తెలిపింది. జయలలిత మృతి తర్వాత తొలిసారిగా జరిగిన మంత్రివర్గ సమావేశానికి ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం అధ్యక్షత వహించారు.