జాతీయ వార్తలు

ఉపాధి లేకుంటే సంక్షోభమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింద్వారా (మధ్యప్రదేశ్), డిసెంబర్ 14: దేశంలో యువత ఉపాధి లేకుండా నిరుద్యోగంతో మిగిలిపోతే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ హెచ్చరించారు. యువతరానికి సరైన ఉపాధి అవకాశాలు కల్పించటంలో ప్రభుత్వాలు విఫలమైతే, వారిలో అసంతృప్తి, అసహనం రగిలిపోతుందని, పర్యవసానంగా దేశం తీవ్రమైన అనిశ్చితిని ఎదుర్కోవలసి వస్తుందని ఆయన అన్నారు. చింద్వారాలో సిఐఐ నైపుణ్య శిక్షణా కేంద్రం వార్షిక కార్యక్రమంలో బుధవారం ఆయన ప్రసంగించారు. యువతకు సరైన ఉపాధి లభిస్తే అది దేశానికి గొప్ప సంపద అవుతుందని ఆయన అన్నారు. ‘దేశంలో యూనివర్శిటీలు, కాలేజీలు వేల సంఖ్యలో పట్ట్భద్రులను తయారు చేస్తున్నాయి. వారిలో చాలామందికి ఉద్యోగాలు దొరకటం లేదు. ప్రపంచంలో రెండో అతిపెద్ద జనాభా ఉన్న దేశమైన భారత్‌లో సగం మంది 25 ఏళ్లలోపువారేనని గ్రహించాలి. వీరికి తగిన ఉద్యోగాలు లభిస్తే దేశానికి వారు ఆస్తిగా మారతారు. ఉద్యోగాలు కల్పించలేకపోతే వారిలో అసహనం పెరిగిపోతుంది’ అని రాష్టప్రతి వ్యాఖ్యానించారు. ‘నైపుణ్యం గల మానవ వనరులు లేక మన పరిశ్రమలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయ. ప్రపంచంలో ఎక్కువ వయసున్న జనాభాతో సంపన్న దేశాల ఆర్థిక వ్యవస్థల పురోగతి మందగించింది. భారత్, చైనా లాంటి ఆర్థిక వ్యవస్థలు వేగంగా దూసుకుపోతున్న దేశాల్లో అందివచ్చిన ఏ అవకాశాన్ని కూడా విడిచిపెట్టకూడదు. అందుకే నైపుణ్య అభివృద్ధికోసం అన్ని దారుల్లోనూ ప్రోత్సాహం ఇవ్వటం అత్యవసరం. ప్రస్తుత ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది’ అని ప్రణబ్ తెలిపారు. దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో నైపుణ్యాభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని, అది ఒక ఉద్యమంలా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

చిత్రం... చింద్వారాలోని సిఐఐ నైపుణ్య శిక్షణా కేంద్రం వార్షికోత్సవంలో పాల్గొన్న రాష్టప్రతి ప్రణబ్