జాతీయ వార్తలు

రిజిజు రాజీనామా చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరెన్ రిజిజుపై వచ్చిన అవినీతి ఆరోపణలు బుధవారంనాడు రాజ్యసభను కుదిపేశాయి. రాజ్యసభ జీరో అవర్‌లో దివ్యాంగుల బిల్లుపై చర్చ అనంతరం ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ ఎంపీ అనంద్‌శర్మ మంత్రి రిజిజు అరుణాచల్ ప్రదేశ్‌లోని హైడ్రో ప్రాజెక్టు విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై వివరణ ఇవ్వాలని, పదవి నుంచి తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో రాజ్యసభ చైర్మన్ ఇప్పడు ఇలాంటివి ప్రస్తావించవద్దని కాంగ్రెస్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఇదీ ప్రశ్నోత్తరాల సమయం కాబట్టి కొనసాగించాలని డిప్యూటీ చైర్మన్ విపక్ష సభ్యులను కోరారు. ప్రతిపక్షాలు వినకపోవడంతో చైర్మన్ అన్సారీ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. రాజ్యసభ రెండు గంటలకు ప్రారంభమైన తర్వాత దివ్యాంగుల సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. అనంతరం కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ఆనంద్ శర్మ కేంద్రమంత్రి కిరెన్ రిజిజుపై వచ్చిన అవినీతి ఆరోపణల అంశాన్ని మళ్లీ లేవనెత్తారు. విద్యుత్ కుంభకోణంలో రిజిజు పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. కేంద్రమంత్రిపై వచ్చిన ఆరోపణలపై సుమోటొగా తీసుకొని నిబంధనలకు విరుద్ధంగా చర్చించలేమని డిప్యూటీ చైర్మన్ తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జోక్యం చేసుకుంటూ రిజిజుపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. వారు చెబుతున్న వాటిలో వాస్తవం లేదని జైట్లీ అన్నారు. సభ్యులపై ఆరోపణలను చర్చించడానికి ముందుగా చైర్మన్‌కి సమాచారం ఇవ్వాలని డిప్యూటీ చైర్మన్ కాంగ్రెస్ సభ్యులకు స్పష్టంచేశారు. దీనిపై అనంద్‌శర్మ స్పందిస్తూ తాను ముందుగానే చైర్మన్‌కి నోటీసులు ఇచ్చినట్టు స్పష్టం చేశారు. రిజిజుపై వచ్చిన ఆరోపణలను ఆధారాలతోసహా జాతీయ పత్రికలలో, ప్రజల దృష్టిలో ఉన్నాయని అనంద్‌శర్మ తెలిపారు. దీంతో విపక్ష సభ్యులు, అధికారపక్ష సభ్యులు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఇలా అయితే సభను నడపడం కష్టమంటూ డిప్యూటీ చైర్మన్ రాజ్యసభను గురువారానికి వాయిదావేశారు.

చిత్రం... బుధవారం రాజ్యసభలో మాట్లాడుతున్న కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ