జాతీయ వార్తలు

పాత 500 నోట్లు ఇక చెల్లవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: రద్దయిన 500 రూపాయల నోటు చలామణి గురువారం అర్ధరాత్రి నుంచి పూర్తిగా ఆగిపోతుంది. మందుల షాపులు, వినిమయ బిల్లులకు ఎక్కడా పాత 500 నోట్లు తీసుకోరు. చలామణి గడువు పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఆంగీకారం తెలపలేదు. అంతేకాదు మొబైల్ రిచార్జీకి కూడా పాత 500 రూపాయల నోటు చెల్లదు. అయతే బ్యాంకుల్లో డిపాజిట్ మాత్రం చేసుకోవచ్చు. ‘పాత 500 నోట్ల చెల్లుబాటుకు సంబంధించి గతంలో పొడిగించిన గడువు ఈ నెల 15 అర్ధరాత్రితో ముగిసిపోతుంది’ అని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శశికాంత దాస్ బుధవారం ప్రకటించారు. పబ్లిక్ యుటిలిటీ బిల్లులైన విద్యుత్, నీటి పన్నులు, మందుల దుకాణాల్లోనూ పాత 500 నోట్లు ఇక స్వీకరించబోరని ఆయన స్పష్టం చేశారు. నవంబర్ 8 రాత్రి నుంచి 1000, 500 రూపాయల నోట్లను రద్దుచేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. అయితే కొన్ని సర్వీసుల్లో చెల్లుబాటు అయ్యేలా మినహాయింపు ఇచ్చింది. మధ్యలో కొన్ని పాత 1000 నోటు చలామణి ఆగిపోగా, 500 మాత్రం కొన్ని సర్వీసులకు అనుమతించారు.

గురువారం అర్ధరాత్రినుంచి అదీ నిలిచిపోనుంది.