రాష్ట్రీయం

బీమా పేరుతో మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 30: లైప్ ఇన్సూరెన్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను సిసిఎస్ పోలీసులకు పట్టుబడింది. దిల్లీకి చెందిన పదిమంది ముఠా సభ్యులను హైదరాబాద్ సిసిఎస్ పోలీసలు బుధవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 7.3 లక్షల నగదుతోపాటు 3 ల్యాప్‌టాప్‌లు, 11 హార్డ్ డిస్కులు, 37 సెల్‌ఫోన్లు, 4 డెబిట్ కార్డులు, ఒక పాన్‌కార్డు, 11 రిజిస్టర్లు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా కోటిన్నర నగదు ఉన్న బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. అరెస్టయిన వారిలో దిల్లీకి చెందిన రాకేష్‌కుమార్, ఉదయ్ మహాజన్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సర్దుల్ సిద్దు, దిల్లీకి చెందిన రాజీవ్‌సింగ్, రాజీవ్ వర్మ, దిల్బర్, సరోజ్ కుమార్, లక్నోకు చెందిన అలోక్ శుక్లా, రమేశ్ యాదవ్, ఇఫ్తెఖారుద్దీన్ ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన రిటైర్ట్ ఎఎస్‌ఐ మహమ్మద్ లియాఖత్ అలీ ఖాన్‌కు అమన్ వర్మ అనే యువకుడు ఇండియన్ వాల్యు కార్డు ఏజెంట్‌గా పరిచయం చేసుకొని మోసానికి పాల్పడతారు. మీకు ఇన్సూరెన్స్ డబ్బులు రూ. 18,12,642లు మంజూరయ్యాయంటూ నమ్మబలికి, మీ అవౌంట్‌ను డ్రా చేసుకోవచ్చని చెబుతాడు. అయితే ఇండియన్ వాల్యు కార్డుద్వారా అమన్ వర్మ రూ. 1.42లక్షలకు చెక్‌ను పంపించారు. అదేవిధంగా మరో రెండు పాలసీలు తీసుకోవాల్సిందిగా కోరగా, నేహా సింగ్, రంజన్ ఘోష్ అనే ఇద్దరు ఏజెంట్లుగా వ్యవహరిస్తూ ఆ పాలసీలకు సంబంధించి డాక్యుమెంట్లు పంపించారు. దీంతో లియాఖత్ అలీఖాన్, అమన్ వర్మ మాటలకు మోసపోయి మరో రెండు పాలసీల ప్రీమియం తీసుకోవాల్సిందిగా అందుకు రూ.2,11,000/ రూ. 2,37,448ల చెక్‌లను పంజాబ్ నేషనల్ బ్యాంకు అక్కౌంట్ నం. 594100210 000112, 2989002105003016లలో జమ చేశారు. సదరు జమ చేసిన డిపాజిట్‌ను మల్లేష్‌యాదవ్, ఇఫ్తెఖారుద్దీన్‌లు డ్రా చేసుకున్నారు.
కాగా తనకు మంజూరైన మొత్తం రూ. 18,12,642లు చెక్ రాకపోవడంతో, తాను మోసపోయాయని సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు లైఫ్ ఇన్సూరెన్స్ పేరిట మోసగిస్తున్న ముఠాను బ్యాంక్ నంబర్ల ఆధారంగా కనుగొన్నారు. మోసాలకు పాల్పడుతున్న పదిమంది ముఠా సభ్యులను దిల్లీలో ఏడుగురిని, లక్నోలో ముగ్గురిని అరెస్టు చేశామని సిసిఎస్ జాయింట్ కమిషనర్ ప్రభాకర్‌రావు తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 150మందికి పైగా వివిధ వ్యాపారాల ముసుగులో మోసగించిన వీరిని అరెస్టు చేయడంతో పాటు సుమారు కోటి రూపాయల నగదు ఖాతాల లావాదేవీలను స్తంభింపజేశామని సిసిఎస్ జెసి వివరించారు.

ఏపిలో పదిమంది
ఐపిఎస్‌ల బదిలీ

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 30: ఆంధ్రప్రదేశ్‌లో పది మంది ఐపిఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నర్సీపట్నం ఎఎస్పీగా ఐశ్వర్య రస్తోగి, రంపచోడవరం ఎఎస్పీగా అద్నమ్ నీద్ అస్మి, సిఐడి ఎఎస్పీగా ఎన్.శే్వత, పాడేరు ఎఎస్పీగా కె.కాశికుమార్, కడప ఆపరేషన్స్ అదనపుఎస్పీగా బి.సత్యఏసు బాబు, గ్రేహౌండ్స్ స్క్వాడ్రన్ కమాండర్‌గా ఫకీరప్ప కాగినెల్లి, నర్సీపట్నం ఆపరేషన్స్ అదనపు ఎస్పీగా బాబూజీ అట్టాడ, గుంటూరు అర్భన్ వెస్ట్ ఎఎస్పీగా సిహెచ్ వెంకట అప్పలనాయుడు, చిత్తూరు అదనపు ఎస్పీగా అభిషేక్ మహంతీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా సి.హెచ్.విజయారావు, రాహుల్‌దేవ్ శర్మ, విశాల్ గున్నిలను డిజిపి కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు వెలువడ్డాయి.