జాతీయ వార్తలు

శేఖర్‌రెడ్డి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణపై ఇటీవల సోదాలు నిర్వహించిన టిటిడి బోర్డు మాజీ సభ్యుడు, ప్రముఖ కాంట్రాక్టర్ జె శేఖర్ రెడ్డిని, ఆయన అనుచరుడు కె శ్రీనివాసులు, ప్రేమ్‌కుమార్‌లను సిబిఐ బుధవారం చెన్నైలో అరెస్టు చేసింది. సిబిఐ వారిని సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా కోర్టు వారికి జనవరి 3 వరకు రిమాండ్ విధించింది. చెన్నైలోని శేఖర్ రెడ్డి నివాసం, ఆయన కార్యాలయాలపై ఆదాయం పన్ను శాఖ ఇటీవల జరిపిన దాడుల్లో 127 కిలోల బంగారం, 170 కోట్ల రూపాయలకు పైగా విలువ కలిగిన రద్దయిన వెయ్యి, 500 రూపాయల నోట్లతో పాటు కొత్త 2 వేల రూపాయల నోట్లు పట్టుబడిన విషయం తెలిసిందే. కాగా, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి. రామమోహన్ రావుతో శేఖర్ రెడ్డికి ఉన్న సంబంధాలపైన కూడా ఆదాయం పన్ను శాఖ దృష్టిపెట్టినట్లు, రాష్టవ్య్రాప్తంగా ఇసుక మైనింగ్ కాంట్రాక్ట్‌లు పొందడంలో శేఖర్ రెడ్డి రామమోహన్ రావు సహాయం తీసుకున్నట్లు ఆ శాఖ అనుమానిస్తున్నట్లు సిబిఐ వర్గాలు తెలిపాయి. శేఖర్ రెడ్డి, ఆయన అనుచరులు ప్రేమ్‌కుమార్, శ్రీనివాసులు వివిధ బ్యాంకులకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులతో కుమ్మక్కయి తమ వద్ద భారీ మొత్తంలో ఉన్న పాత కరెన్సీ నోట్లను కొత్త 2 వేల రూపాయల నోట్లకు మార్చుకున్నట్లు సిబిఐ తన ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపించింది.