జాతీయ వార్తలు

నగదురహిత వేతనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: పెద్ద నోట్ల రద్దు వల్ల దేశంలో నగదు కొరత ఏర్పడిన నేపథ్యంలో వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు తమ ఉద్యోగులకు వేతనాలను చెక్కులు లేదా ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ రూపంలో ఇవ్వడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం బుధవారం వేతన చెల్లింపు చట్టాన్ని (ద పేమెంట్ ఆఫ్ వేజ్ యాక్ట్)ను సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్‌ను కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. అయితే తమ ఉద్యోగులకు నగదు రూపంలోనే వేతనాలు ఇచ్చే ప్రత్యామ్నాయ వెసులుబాటు కూడా యాజమాన్యాలకు ఉంటుంది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం ఎవరైనా ఉద్యోగి లేదా ఉద్యోగులు రాతపూర్వకంగా కోరితేనే యాజమాన్యాలు వేతనాన్ని చెక్కు రూపంలో ఇవ్వడం లేదా ఉద్యోగి బ్యాంకు ఖాతాలోకి సదరు మొత్తాన్ని బదిలీ చేయడానికి వీలుపడుతుంది. కొత్త నియమాలను వెంటనే అమలులోకి తేవడానికి ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవడం పరిపాటి. అయితే ఈ ఆర్డినెన్సులు ఆరు నెలల వరకే చెల్లుతాయి. ఆలోగా పార్లమెంటు ఆమోదం పొందడం తప్పనిసరి. యాజమాన్యాలు ఉద్యోగులకు వేతనాలను చెక్కులు లేదా ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ రూపంలో చెల్లించడానికి వీలుగా ‘ద పేమెంట్ ఆఫ్ వేజెస్ (సవరణ) బిల్లు-2016’లోని సెక్షన్ 6ను సవరించనున్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై పార్లమెంటులో గందరగోళం నెలకొన్న సమయంలోనే కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. డిజిటల్, నగదు రహిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ సవరణ దోహదపడుతుందని ఆ బిల్లులో పేర్కొన్నారు. వేతనాల చెల్లింపుల్లో నగదు రహిత విధానాన్ని అవలంబించాలని పరిశ్రమలకు, సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించడానికి కూడా ఈ బిల్లు దోహదపడుతుంది. ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, కేరళ, హర్యానా రాష్ట్రాలు ఇదివరకే ఈ చట్టానికి రాష్ట్ర స్థాయిలో సవరణలు చేసి, వేతనాలు చెక్కులు లేదా ఎలక్ట్రానిక్ బదిలీ రూపంలో చెల్లించేలా వీలు కల్పించాయి.
వచ్చే సమావేశాల్లో ఆమోదంకోసం కృషి
వచ్చే పార్లమెంట్ సమావేశాలలో వేతన చెల్లింపుల చట్టానికి సవరణలతో కూడిన బిల్లు ఆమోదం పొందేలా చూస్తామని కేంద్ర మంత్రి దత్తాత్రేయ బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఈ ఆర్డినెన్స్ వల్ల ఉద్యోగుల వేతనాల చెల్లింపులో పారదర్శకత పెరుగుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. కార్మిక సంఘాలు ఎన్నో ఏళ్లుగా చేస్తున్న డిమాండ్‌కు ఈ ఆర్డినెన్స్ ద్వారా పరిష్కారం చూపినట్టు అయ్యిందన్నారు. ఉద్యోగులకు చెల్లించే వేతనాలలో కనీస వేతనం, వేతన చెల్లింపులు రెండు వేర్వేరని తెలిపారు. గతంలో వేతన చెల్లింపులు అన్ని నగదు రూపంలో చేశేవారని, ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ తీసుకురావడం వల్ల వేతనాలను ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలలోకి బదిలీ చేయడం లేదా చెక్కుల ద్వారా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.

చిత్రం... కేబినెట్ భేటీ నుంచి బయటకు వస్తున్న మంత్రులు