జాతీయ వార్తలు

హైదరాబాద్‌కు నేడు రాష్టప్రతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: దక్షిణాది రాష్ట్రాల వార్షిక విడిది కోసం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ గురువారం తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని రాష్టప్రతి నిలయానికి వస్తున్నారు. ప్రణబ్ ముఖర్జీ ఈనెల 22 నుండి 31వ తేదీ వరకు దక్షిణాది రాష్ట్రాలలో వార్షిక పర్యటన జరుపుతారు. ప్రణబ్ ముఖర్జీ ఈ సందర్భంగా డిసెంబర్ 23న సికిందరాబాద్‌లోని సైనిక దంత విజ్ఞాన కళాశాలకు సంబంధించిన ఆరవ ఎండి, పదకొండవ బిడిఎస్ స్నాతకోత్సవాలకు హాజరవుతారు. ఇదే రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాణిజ్య, పారిశ్రామిక సమాఖ్య సెంటినరీ ఉత్సవాలకు ఆయన హాజరవుతారు. 24న మహిళా దక్షత సమితి, బన్సీలాల్ మలానీ నర్సింగ్ కాలేజీని ఆయన ప్రారంభిస్తారు. 25న కర్ణాటక రాజధాని బెంగళూరుకు వెళతారు. ఆయన బెంగళూరులో నిఖిల్ భారత్ బంగా సమ్మేళనం 89వ వార్షికోత్సవానికి హాజరవుతారు. 26న ఆయన హైదరాబాద్‌లోని వౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం 6వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. 29న కేరళలోని తిరువనంతపురంలో నిర్వహిస్తున్న 77వ భారత హిస్టరీ కాంగ్రెస్‌ను ఆయన ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మైసూరుకు వెళ్లి 17వ జాతీయ భారత్ స్కౌట్స్, గైడ్స్ జంభోరిని ప్రారంభిస్తారు. 30న బెంగళూరులో శ్రీ శంకర జాతీయ క్యాన్సర్ పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ప్రణబ్ అదే రోజు హైదరాబాద్‌కు తిరిగి వచ్చి సాయంత్రం రాష్టప్రతి నిలయంలో ఏర్పాటు చేసే ఎట్ హోంలో పలువురు రాష్ట్ర ప్రముఖులు, మంత్రులు, అధికారులు, విలేఖరులకు తేనీటి విందు ఇస్తారు.