జాతీయ వార్తలు

పాపినేనికి అకాడమీ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: ఆధునిక తెలుగు కవిత్వంలో తనదైన ముద్రవేసిన పాపినేని శివశంకర్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఈ మేరకు బుధవారం కేంద్ర సాహిత్య అకాడమీ శివశంకర్ రచించిన రజనీగంధ (కవితా సంపుటి)ని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ఉన్న 24 భాషలలో కేంద్ర సాహిత్య అకాడమీ 2016 అవార్డులను బుధవారం ప్రకటించింది. ఈ అవార్డును వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రధానం చెయ్యనున్నారు. పాపినేని శివశంకర్ స్వస్థలం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని నెక్కల్లు. ఆధునిక కవిత్వంలో పాపినేని శివశంకర్ ఇప్పటి వరకు 350 కవితలు, 55కు పైగా కథానికలు, 220 దాకా వ్యాసాలు రచించారు.
మానవీయ దృక్పథంలో రచనలు
గుంటూరు: కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారాన్ని సాధించుకున్న పాపినేని కవి, కథకుడు, విమర్శకుడు, సంపాదకుడు, అధ్యాపకుడు, అన్నింటికీ మించి వక్తగా తెలుగు సాహితీ రంగానికి చేరువయ్యారు. ఉన్నత స్థితికి సమాజం ఎదగాలనే తాత్విక దృష్టితో, మానవీయ దృక్పథంతో ఇప్పటికే వివిధ ప్రక్రియల్లో 11 పుస్తకాలను ఆయన వెలువరించారు. అవిచ్ఛిన్నతా ధోరణి, ద్రవాధునికత వంటి సిద్ధాంతాలను తెలుగు సాహిత్యానికి అన్వయించి పరిచయం చేసిన పాపినేని కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యునిగా కొనసాగుతున్నారు. ఆయన కవిత్వంలో స్తబ్దత- చలనం, ఒక సారాంశం, ఆకుపచ్చని లోకంలో, ఒక ఖడ్గం- ఒక పుష్పం, రజనీగంధ ప్రముఖమైనవి. కాగా మట్టిగుండె, సగం తెరిచిన తలుపులు కథా సంపుటాలు సామాజిక అసమానతలను ప్రతిబింబింపజేశాయి.

పాపినేని శివశంకర్