జాతీయ వార్తలు

ఎంత నల్లధనం బయటపడింది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: పెద్దనోట్లు రద్దు చేసిన తరవాత నల్లధనం ఏ మేరకు బయటకు వచ్చింది, ఎంత నల్లధనం ప్రభుత్వం చేతికి వచ్చింది? అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రశ్నించారు. 500, 1000 రూపాయల నోట్ల రద్దుపై ఆయన ప్రధాన మంత్రికి ఐదు ప్రశ్నలు వేశారు. బుధవారం ఏఐసిసి కార్యాలయంలో కాంగ్రెస్ సంస్థాగత దినోత్సవం సందర్భంగా విలేఖరులతో మాట్లాడారు. రాహుల్‌తోపాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు ఏకె ఆంటోని, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, కోశాధికారి మోతీలాల్ వోరా, ఏఐసిసి ప్రధాన కార్యదర్శులు జనార్దన్ ద్వివేదీ, రణదీప్ సుర్జేవాల్ కూడా విలేఖరుల సమావేశానికి హాజరయ్యారు. కొత్త నోట్లు లభించకపోవటంతో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపై మోదీ దేశ ప్రజలకు వివరణ ఇవ్వటంతోపాటు తాను కూడా కొంత తెలుసుకోవలసిన అవసరం ఉందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చెప్పారు. పెద్ద నోట్ల వల్ల దేశానికి ఏ మేరకు ఆర్థిక నష్టం కలిగింది, ఎంత మంది ఉపాధి కోల్పోయారనేది దేశ ప్రజలకు వివరించవలసిన బాధ్యత ప్రధానిపై ఉందని ఆయన స్పష్టం చేశారు. నోట్లకోసం క్యూల్లో నిలబడి ఎందరు చనిపోయింది, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఎంత సాయం చేసిందన్నదానిపై రాహుల్ మోదీని నిలదీశారు. నవంబర్ 8 తేదీకి మూడు నెలల ముందువరకు ఎంత మంది ఇరవై ఐదు లక్షల రూపాయలు అంతకంటే ఎక్కువ మొత్తాన్ని బ్యాంకుల్లో జమ చేశారు? ఇలా డిపాజిట్ చేసిన వారు ఎవరు? ప్రధాన మంత్రి వీరి జాబితాను దేశ ప్రజల ముందు పెడతారా? అంటూ రాహుల్ గాంధీ ప్రశ్నలు సంధించారు. తాను ముందు చెప్పినట్లు ప్రధాన మంత్రి కేవలం 50 మంది పెద్ద పారిశ్రామిక కుటుంబాలవారికి ప్రయోజనం కలిగించేందుకే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశంలో పేద ప్రజలకు తీవ్రనష్టం వాటిల్లిందని రాహుల్ పునరుద్ఘాటించారు. బ్యాంకుల్లో ఉన్నది ప్రజల డబ్బు, ప్రభుత్వానిదో, బ్యాంకులదో కాదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు స్పష్టం చేశారు. విత్‌డ్రాలపై విధించిన 24వేల పరిమితి వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. పెద్దనోట్ల రద్దువల్ల దెబ్బతిన్న రైతుల రుణాలు మాఫీ చేయాలని, ఎంఎస్‌పిపై 20 శాతం బోనస్ ఇవ్వాలని రాహుల్ డిమాండ్ చేశారు. స్విస్ బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్న వారి పేర్లు వెల్లడించాలన్న రాహుల్ లోక్‌సభ, రాజ్యసభల్లో ఈ జాబితాలను ఎప్పుడు పెడతారనేది వెల్లడించాలని డిమాండ్ చేశారు.