జాతీయ వార్తలు

బక్సర్ జైలు నుంచి ఐదుగురు ఖైదీల పరార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బక్సర్, డిసెంబర్ 31: పంజాబ్‌లోని నభా సెంట్రల్ జైల్ నుంచి ఐదుగురు ఖలిస్తాన్ ఉగ్రవాదులు పరారైన ఘటన మరచిపోకముందే బిహార్‌లోని బక్సర్‌లో అలాంటి సంఘటనే చోటుచేసుకుంది. బక్సర్ కేంద్ర కారాగారం నుంచి ఐదుగురు ఖైదీలు శుక్రవారం రాత్రి తప్పించుకున్నారు. జీవితఖైదు అనుభవిస్తున్న నలుగురు, మరో ఖైదీ గోడదూకి పారిపోయారు. ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురు జైలు అధికారులను సస్పెండ్ చేశారు. శుక్రవారం అర్థరాత్రి 12 గంటల తరువాత ఖైదీలు పరారైనట్టు జిల్లా మెజిస్ట్రేట్ రామణ్‌కుమార్ శనివారం వెల్లడించారు. గోడ దూకడానికి ఉపయోగించిన ఓ ఇనుమ రాడ్, పైపు, దుప్పటి సంఘటనా స్థలంలో లభించిందని ఆయన అన్నారు. మోతీహరికి చెందిన ప్రజీత్ సింగ్, చప్రా వాసి గిరిధర్ రాయ్, ఆగ్రాకు చెందిన సోనూ పాండే, ఉపేంద్ర షా జీవిత ఖైదీలు. బర్హంపూర్‌కు చెందిన సోనూసింగ్ మరో కేసులో పదేళ్ల నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నాడని, ఐదుగురు ఖైదీలు పక్కా ప్రణాళికతో జైలునుంచి తప్పించుకుపోయారని ఎస్‌పి ఉపేంద్ర శర్మ తెలిపారు. దీనిపై విచారణకు ఆదేశించామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జిల్లా మెజిస్ట్రేట్ స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి చీఫ్ జైలు వార్డెన్ కమేశ్వర్ పాశ్వాన్, వార్డెన్లు రాజ్‌కుమార్ రామ్, ఉపేంద్ర దాస్‌లను జైళ్లశాఖ ఐజి ఆనంద్ కిశోర్ సస్పెండ్ చేశారు.