జాతీయ వార్తలు

బాధ్యతలు స్వీకరించిన ఆర్మీ, వాయుసేన కొత్త చీఫ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: భారత సైనికదళాల నూతన ప్రధానాధికారిగా లెఫ్టెనెంట్ జనరల్ బిపిన్ రావత్ శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. 42 ఏళ్లపాటు సైన్యానికి సేవలందించిన తర్వాత ఈ రోజు రిటైరయిన దల్బీర్ సింగ్ సుహాగ్‌నుంచి ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటుగా ఎయిర్‌మార్షల్ బీరేంద్ర సింగ్ ధనోవా వైమానిక దళాల ప్రధానాధికారిగా అనూప్ రాహా స్థానంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. సైన్యంలో అందరికన్నా సీనియర్లయిన లెఫ్టెనెంట్ జనరల్ ప్రవీణ్ బక్షీ, లెఫ్టెనెంట్ జనరల్ హరిజ్‌ల సీనియారిటీని పక్కన పెట్టి రావత్‌ను ఆర్మీ చీఫ్‌గా నియమించిన విషయం తెలిసిందే. సీనియారిటీని కాదని రావత్‌ను ఆర్మీ చీఫ్‌గా నియమించడంపై కినుకతో ఉన్న బక్షీ రాజీనామా చేయడమో లేదా ముందస్తు రిటైర్మెంట్ తీసుకోవచ్చని ఇంతకుముందు మీడియాలో వార్తలు రావడం తెలిసిందే. అయితే కొత్త ఆర్మీ చీఫ్‌కు పూర్తి సహకారం అందిస్తానని ప్రస్తుతం తూర్పు సైనిక దళాల ప్రధానాధికారిగా ఉన్న బక్షీ ప్రకటించడమే కాకుండా ఇకపై కూడా ఇంతే చిత్తశుద్ధితో సేవలందిస్తానని స్పష్టం చేశారు.
కాగా, పదవీ విరమణ సందర్భంగా దల్బీర్ సింగ్ సుహాగ్, అనూప్ రాహా ఢిల్లీలోని అమర జవాన్ల జ్యోతి వద్ద అమర జవాన్లకు నివాళులర్పించారు. సైనికులు అందించిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా దల్బీర్ మాట్లాడుతూ.. దేశంకోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లకు సెల్యూట్ చేశారు. సైనికులు జరిపిన పోరాటాలకు పూర్తి మద్దతునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మాజీ సైనికులకు ఒకే ర్యాంక్, ఒకే పింఛనును అమలు చేసేందుకు నిధులను విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. బాహ్య, అంతర్గత పోరాటాలు చేసేందుకు, ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సైన్యం సిద్ధంగా ఉందని చెప్పారు. మాటలకన్నా చర్యల్లో సత్తా చూడమే సరయిన చర్య అని నమ్ముతానన్నారు. గత ఏడాది చొరబాటు యత్నాలు పెరిగాయని, సైన్యం చేతిలో హతమైన ఉగ్రవాదుల సంఖ్య దాదాపు రెట్టింపయిందని చెప్పారు.
chitram...
వాయుసేన గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్న కొత్త ఎయిర్ చీఫ్ మార్షల్ బీరేంద్ర సింగ్ ధనోవా. ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన జనరల్ బిపిన్ రావత్