అంతర్జాతీయం

నువ్వు వెరీ స్మార్ట్ గురూ! పుతిన్‌కు ట్రంప్ కితాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, డిసెంబర్ 31: అమెరికా, రష్యాల మధ్య హ్యాకింగ్ అంశంపై తాజాగా చెలరేగుతున్న సంఘర్షణ వాతావరణం త్వరలోనే శే్వతసౌధాన్ని అధిష్ఠించనున్న డొనాల్డ్ ట్రంప్ తాజా వ్యాఖ్యలతో రసవత్తరంగా మారింది. ట్రంప్‌ను గెలిపించేందుకే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా హ్యాకింగ్‌కు పాల్పడిందని భావించిన అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆర్థిక ఆంక్షలను విధించడమే కాకుండా రష్యాకు చెందిన అనేకమంది ఏజెంట్లను బహిష్కరించారు, దీనికి ప్రతిగా తమ దేశంలోని అమెరికా ఏజెంట్లను బహిష్కరించాలని రష్యా భావించినా ఆ దేశాధ్యక్షుడు పుతిన్ చివరి క్షణంలో నిర్ణయం మార్చుకున్నారు. అంటే అమెరికా చేసినట్టుగానే రష్యా కూడా ప్రతికార చర్యకు పాల్పడి వుంటే పరిస్థితి మరోలా ఉండేది. పుతిన్ సంయమనాన్ని అభినందించడమే కాకుండా ‘నువ్వు చాలా తెలివైనవాడికి అని కూడా’ ట్రంప్ ప్రశంసించారు.
మొదటినుంచీ కూడా పుతిన్‌ది ఇదే రకమైన వ్యవహార శైలి అని ట్రంప్ పేర్కొన్నారు. రష్యా చర్యల వల్ల అమెరికా ప్రయోజనాలను దెబ్బతినే ప్రమాదం ఉన్నందునే ఆ దేశానికి చెందిన 32 మంది ఏజెంట్లను బహిష్కరిస్తున్నట్టు ఒబామా తన ఉత్తర్వుల్లో తెలిపారు. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం తమకు గల ప్రతికార చర్య హక్కు వినియోగాన్ని వాయిదా వేసుకుంటున్నామన్నారు. అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అనుసరించే విధాలను బట్టే తమ తదుపరి నిర్ణయాలుంటాయన్నారు. అమెరికానుంచి తిరిగొచ్చేసిన రష్యా దౌత్యవేత్తలందరూ సొంత దేశంలో స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడపుతారని చెప్పారు. అంతేకాదు రష్యాలో ఉన్న అమెరికా దౌత్యవేత్తలందరినీ కూడా క్రెమ్లిన్‌లో జరిగే కొత్త సంవత్సర వేడుకలకు ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు.