జాతీయ వార్తలు

అమ్మ బాటలోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 31: ఎఐఎడిఎంకె అధినేత్రిగా వికె.శశికళ శనివారం లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆమె చెన్నైలో తొలిసారి పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె.జయలలిత వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తానని ప్రతిజ్ఞ చేశారు. జయలలితతో పాటు ఎఐఎడిఎంకె వ్యవస్థాపకులు ఎంజి.రామచంద్రన్, ద్రవిడ సిద్ధాంతకర్త సిఎన్.అన్నాదురైలకు పార్టీలో ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, వీరికంటే ఎవరూ ఎక్కువ కాదని ఆమె ఉద్ఘాటించారు. ఎఐఎడిఎంకెని ‘అమ్మ’ ఎంతో క్రమశిక్షణతో ముందుకు నడిపారని, ఇకముందు కూడా పార్టీ అదేబాటలో ముందుకు సాగుతుందని, కుల మతాలకు అతీతంగా పైన పేర్కొన్న నాయకుల అడుగుజాడల్లోనే నడుస్తుందని చెప్పారు. ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శిగా శశికళ బాధ్యతలు చేపట్టడం పట్ల కొన్నిచోట్ల నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆమె ఈ విషయాలను స్పష్టం చేశారు. ‘అమ్మ అడుగుజాడలు, ఆమె నేర్పిన రాజకీయ పాఠాలే మాకు వేదాలు. అమ్మ తీర్చిదిద్దిన ఈ ఉద్యమం (ఎఐఎడిఎంకె) ప్రజల ఉద్యమం. ఇది ప్రజా ప్రభుత్వం. అమ్మ బాటలోనే మా పయనం సాగుతుంది. పార్టీ కార్యకర్తల అభ్యున్నతికోసం అమ్మ పాటించిన ప్రమాణాలు అలాగే కొనసాగుతాయి. ఈ విషయంలో ఒక్క అంగుళం కూడా పక్కకు జరిగే ప్రసక్తే లేదు’ అని ఆమె పేర్కొన్నారు. జయలలిత ఎంతో ధైర్యవంతురాలని, రాజకీయాల్లో పురుషాధిక్యతను పటాపంచలు చేసిన ఆమె దేశంలోని కోట్లాది మంది మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారని శశికళ ప్రశంసించారు. ‘కోట్లాది మంది సోదర సోదరీమణులు మద్దతు తెలుపుతారన్న నమ్మకంతోనే మహిళగా నేను ఈ రోజు పార్టీకి నాయకత్వం వహించేందుకు ముందుకు వచ్చా. అయినప్పటికీ అమ్మ మరణంతో ఏర్పడిన వెలితిని మరో వెయ్యేళ్లదాకా ఎవరూ భర్తీ చేయలేరు’ అని ఆమె అన్నారు.

చిత్రం... ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మాట్లాడుతున్న శశికళ