జాతీయ వార్తలు

ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 4: దేశ రాజకీయాలను నిర్దేశించే ఉత్తరప్రదేశ్‌తోపాటు పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్ర శాసనసభల ఎన్నికల నగారా మోగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నల్లధనం, అవినీతి, ఉగ్రవాదాన్ని అదుపు చేసేందుకు పాత వెయ్యి, ఐదువందల నోట్లను రద్దుచేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న సంచలన నిర్ణయం నేపథ్యంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికలకు క్వార్టర్ ఫైనల్ ఎన్నికలుగా అభివర్ణిస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ఫిబ్రవరి నాలుగో తేదీన ప్రారంభం అవుతుంది. ఓట్ల లెక్కింపు మార్చి పదకొండో తేదీన జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. 403 అసెంబ్లీ నియోజకవర్గాలతో దేశంలోని అతిపెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్‌లో పోలింగ్ ఏడు దశల్లో జరుగుతుంది. ఫిబ్రవరి 11, 15, 19, 23, 27, మార్చి 4, 8 తేదీల్లో జరుగుతుంది. నలభై సీట్లున్న గోవా, 117 సీట్లున్న పంజాబ్ శాసనసభ ఎన్నికలు ఫిబ్రవరి నాలుగో తేదీన జరుగుతాయి. 70 సీట్లున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీ పోలింగ్ ఫిబ్రవరి 15న జరుగుతుంది. ఈశాన్య రాష్టమ్రైన మణిపూర్‌లోని 60 అసెంబ్లీ సీట్లకు రెండు దఫాలుగా మార్చి 4, మార్చి 8 తేదీల్లో జరుగుతుంది. ఎన్నికల్లో కులం, మతం, ప్రాంతం ఆధారంగా ఓట్లు అడిగేందుకు వీలులేదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల ప్రచార ఖర్చుకు పరిమితి విధించింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ ఎన్నికల బరిలోకి దిగుతున్న అభ్యర్థులు ఎన్నికల ప్రచారంకోసం 28 లక్షలు, గోవా, మణిపూర్ శాసనసభలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు 20 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేయకూడదని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి బుధవారం నుంచే అమలులోకి వచ్చింది. దీనిని తు.చ. తప్పకుండా అమలు చేయాలని ఐదు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.గోవా, మణిపూర్, పంజాబ్ ప్రస్తుత శాసనసభల కాల పరిమితి మార్చి 18వ తేదీతో ముగుస్తుంది. ఉత్తరాఖండ్ శాసనసభ కాల పరిమితి మార్చి 23న, ఉత్తరప్రదేశ్ శాసనసభ కాల పరిమితి మే 27వ తేదీతో ముగుస్తుంది. గోవాలో 10,85,271, మణిపూర్‌లో 18,07,843 మంది, పంజాబ్‌లో 1,92,14,235, ఉత్తరాఖండ్‌లో 73,81,000, ఉత్తరప్రదేశ్‌లో 13,85,17,026 మంది ఓటర్లున్నారు.

గోవా, పంజాబ్
జనవరి 11న నోటిఫికేషన్ జారీ. 18లోగా నామినేషన్లను దాఖలు చేయాలి. నామినేషన్లను 19న పరిశీలిస్తారు. అభ్యర్థులు తమ నామినేషన్లను జనవరి 21లోగా ఉపసంహరించుకోవలసి ఉంటుంది. ఫిబ్రవరి 4న పోలింగ్.

ఉత్తర ప్రదేశ్..
మొదటి దశకు జనవరి 17, రెండో దశకు జనవరి 20, మూడో దశకు జనవరి 24, నాల్గవ దశకు జనవరి 30, ఐదవ దశకు ఫిబ్రవరి 2, ఆరవ దశకు ఫిబ్రవరి 8, ఏడవ దశకు ఫిబ్రవరి 11న నోటిఫికేషన్ జారీ అవుతుంది. నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీలు జనవరి 24, 27, 31, ఫిబ్రవరి 6, 9, 15, 18. నామినేషన్లను జనవరి 25, 28, ఫిబ్రవరి 2, 7, 11, 16, 20 తేదీల్లో పరిశీలిస్తారు. జనవరి 27, 30, ఫిబ్రవరి 4, 9, 13, 18, 22 తేదీల్లోగా ఉపసంహరించుకోవలసి ఉంటుంది. ఫిబ్రవరి 11, 15, 19, 23, 27, మార్చి 4, 8 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది.

ఉత్తరాఖండ్..
జనవరి 20న నోటిఫికేషన్ జారీచేస్తారు. అభ్యర్థులు తమ నామినేషన్లను జనవరి 27లోగా దాఖలు చేయాలి. నామినేషన్లను జనవరి 28న పరిశీలిస్తారు. జనవరి 30లోగా నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఫిబ్రవరి 15న పోలింగ్ .

మణిపూర్..
రాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 11న జారీ చేస్తారు. నామినేషన్లను ఫిబ్రవరి 18లోగా దాఖలు చేయాలి. పరిశీలన ఫిబ్రవరి 20న జరుగుతుంది. అభ్యర్థులు ఫిబ్రవరి 22లోగా తమ నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకోవాలి. మొదటి దశ మార్చి 4, రెండో దశ పోలింగ్ ఎనిమిదో తేదీన జరుగుతుంది.

చిత్రం... బుధవారం ఢిల్లీలో విలేఖరుల సమావేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల
షెడ్యూల్ వివరాలు వెల్లడిస్తున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నసీమ్ జైదీ, ఎన్నికల కమిషనర్లు అచల్‌కుమార్ జ్యోతి, ఓమ్ ప్రకాశ్ రావత్