జాతీయ వార్తలు

యుపిలో మోదీ ప్రతిష్ఠకు పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 4: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠకు అగ్ని పరీక్షగా మారతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని వివిధ బ్యాంకుల ఏటిఎంలలో కొత్త నోట్లు పుష్కలంగా లభించకపోతే విజయం సాధించటం కష్టమని బిజెపి రాష్ట్ర నాయకులు తమ అధినాయకులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. దేశంలోని అతి పెద్ద రాష్టమ్రైన యుపిలో అధికారంలోకి రాగలిగితే ఆ తరువాత జరిగే గుజరాత్ తదితర రాష్ట్రాల శాసన సభలలో విజయం సాధించటంతోపాటు 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి సునాయసంగా విజయం సాధించి వరుసగా రెండోసారి అధికారంలోకి రాగలుగుతామని వారు వాదిస్తున్నారు. పాత నోట్ల స్థానంలో కొత్తనోట్లు లభించక ప్రజలు నానా కష్టాలు పడుతున్నారని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఓటమిని చవి చూడకతప్పదని కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌తో పాటుగా పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జగుతున్నప్పటికీ బిజెపి అధినాయకత్వం దృష్టి ప్రధానంగా యుపి అసెంబ్లీ ఎన్నికలపై కేంద్రీకృతమై ఉన్నది. పంజాబ్‌లో బిజెపి మిత్రపక్షమైన అకాలీదళ్ తప్పుడు పాలనతో విసిగి వేసారిపోయిన రాష్ట్ర ప్రజలు ఈ సారి కాంగ్రెస్‌కు పట్టం కట్టే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అయితే మోదీ ఎన్నికల వ్యూహకర్తలు ఈ అభిప్రాయంకో ఏకీభవించటం లేదు. దేశం అభివృద్ధి, ప్రజల అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ ఇటీవలి కాలంలో తీసుకున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న పథకాల మూలంగా పంజాబ్‌లో తమ కూటమి మరోసారి అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోకూడదని వారు వాదిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లో బిజెపి విజయం ఖాయమని వారంటున్నారు. హరీష్ రావత్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పెద్ద పీట వేసి ప్రజల ప్రయోజనాలను కాపాడటంలో ఘోరంగా విఫలమైనందున బిజెపి సునాయసంగా అధికారంలోకి వస్తుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. గోవాలో కూడా తాము మళ్లీ అధికారంలోకి వస్తున్నామని వారు చెబుతున్నారు. యుపిలో ప్రస్తుతం అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ కుటుంబ కలహాలతో కుతకుతలాడిపోతోంది. మాయావతి నాయకత్వంలోని బిఎస్‌పి పట్ల ప్రజలకు విశ్వాసం లేదని, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పుట్టగతులు లేనందున బిజెపి విజయం సాధించే అవకాశాలు అధికంగా ఉన్నాయని పార్టీ నాయకులు చెబుతున్నారు.
మోదీ పెద్ద నోట్లను రద్దు చేయటాన్ని దేశ ప్రజలు ముఖ్యంగా యుపి ప్రజలు సమర్థిస్తున్నారని బిజెపి నాయకులు చెబుతున్నారు. మోదీ ఇటీవల గర్భిణీలు, రైతులు, వృద్ధులకు ప్రకటించిన రాయితీలు తమకు రాజకీయంగా కలిసి వస్తాయని వారు వాదిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం వివిధ ప్రాంతాల్లో జరిగిన పలు రకాల ఎన్నికల్లో ప్రజలు బిజెపి అభ్యర్థులను గెలిపించారని, యుపి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే జరుగుతుందని వారంటున్నారు. అయితే బిఎస్‌పి, కాంగ్రెస్ నాయకులు ఈ వాదనతో ఏకీభవించటం లేదు. పెద్దనోట్ల రద్దు అనంతరం ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురి అయ్యారని, వారిప్పుడు బిజెపిని ఓడించి తీరుతారని ఆ పార్టీల నేతలు వాదిస్తున్నారు.