జాతీయ వార్తలు

నిబంధనల ప్రకారమే నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 4: ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల చిహ్నం సైకిల్ తమకే దక్కాలంటూ సమాజ్‌వాదీ పార్టీలోని ఇరువర్గాలు వాదిస్తుండటంతో గతంలో ఇలాంటి సందర్భాల్లో తీసుకున్న నిర్ణయాలపై ఇప్పుడు ఎన్నికల కమిషన్ (ఇసి) దృష్టి సారించనుంది. పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఒకవైపు, కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికయిన ఆయన కుమారుడు, యుపి ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ శిబిరం మరోవైపు తమకే సైకిల్ గుర్తు కేటాయించాలని ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించిన విషయం తెలిసిందే. ‘ఎన్నికల చిహ్నం కేటాయింపునకు సంబంధించి ఇటువంటి సందర్భాల్లో గతంలో తీసుకున్న నిర్ణయాలను, ఇప్పటివరకు అనుసరించిన సూత్రాలను దృష్టిలో పెట్టుకొని కమిషన్ తన ముందున్న పత్రాలను పరిశీలించి, సరయిన సమయంలో సరయిన నిర్ణయం తీసుకుంటుంది’ అని ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీ విలేఖరులకు తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీలో ఎన్నికల చిహ్నానికి సంబంధించిన వివాదాన్ని పరిష్కరించడానికి ‘ఎలక్షన్ సింబల్స్ (రిజర్వేషన్ అండ్ అలాట్‌మెంట్) ఆర్డర్, 1968లోని పారాగ్రాఫ్ 15ను ఎన్నికల కమిషన్ అనుసరిస్తుందని కమిషన్ వర్గాలు తెలిపాయి. ఒక గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ చీలిపోయినప్పుడు ఏ వర్గాన్ని అసలు పార్టీగా గుర్తించాలి, ఏ వర్గానికి ఆ పార్టీ ఎన్నికల చిహ్నాన్ని కేటాయించాలి అనే విషయాన్ని నిర్ణయించే అధికారం ఎన్నికల సంఘానికి ఉందని ఈ పారాగ్రాఫ్ వెల్లడిస్తోంది. గత రెండు మూడు రోజుల నుంచి ములాయం సింగ్ యాదవ్ నుంచి ఒకవైపు, రాంగోపాల్ యాదవ్, అఖిలేశ్ యాదవ్ నుంచి మరోవైపు సైకిల్ గుర్తు కోసం తమకు విజ్ఞాపనలు అందాయని జైదీ వివరించారు. మంగళవారం సాయంత్రం రాంగోపాల్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీలో చీలికకు సంబంధించిన సమగ్రమైన పత్రాన్ని ఎన్నికల సంఘానికి అందజేశారు. అంతకుముందు రోజు సోమవారం ములాయం సింగ్ యాదవ్ తన సోదరుడు శివపాల్ యాదవ్ తదితరులతో కలిసి వెళ్లి పార్టీ వ్యవస్థాపకుడినయిన తనకే సైకిల్ గుర్తు కేటాయించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.