జాతీయ వార్తలు

జయలలిత మృతిపై దర్యాప్తు జరపాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జనవరి 4: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె జయలలిత మరణానికి సంబంధించి అనేక సందేహాలు వ్యక్తం చేస్తూ మద్రాసు హైకోర్టులో మరో రెండు ప్రజాహిత పిటిషన్లు దాఖలయ్యాయి. అసలు జయలలితకు వచ్చిన జబ్బేమిటీ, ఆమెకు ఏ రకమైన చికిత్స చేశారు? అన్నదానిపై విచారణ జరపాలని పిటిషనర్ల్లు డిమాండ్ చేశారు. వీటిని స్వీకరించిన మద్రాసు హైకోర్టు మిగతావాటితోనే రెండు పిటిషన్లను జతచేసింది. జయ మరణానికి దారితీసిన అన్ని విషయాలపై సమగ్ర విచారణ జరపాలంటూ గతంలోనే పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. తాజాగా పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తుల్లో ఒకరు అన్నాడిఎంకె కార్యకర్తకాగా మరొకరు సామాజిక కార్యకర్త. ప్రధాన న్యాయమూర్తి ఎస్‌కె కౌల్ అలాగే న్యాయమూర్తి ఎం సుందర్‌లతో కూడిన హైకోర్టు బెంచ్ రెండు పిటిషన్లను స్వీకరించింది. ఇప్పటికే దాఖలైన వాటితో కలిపి జనవరి 9న విచారణ జరుపుతామని వెల్లడించారు. అన్నాడిఎంకె కార్యకర్త జ్ఞాన శేఖరం తరపున సీనియర్ న్యాయవాది ఆర్ గాంధీ వాదించారు. జయ మృతికి సంబంధించి విచారణ జరిపేందుకు వైద్య నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర హోమ్‌శాఖను ఆదేశించాలని జ్ఞాన శేఖరం కోర్టును కోరారు. అంతేకాకుండా గత రెండు సంవత్సరాలుగా జయకు చేసిన చికిత్స రికార్డులన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని కోరారు. సిబిఐ, ఐబి అధికారులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.