జాతీయ వార్తలు

పేదలే.. మన దేవుళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 7: పేదల అభ్యున్నతే తన ప్రభుత్వ లక్ష్యమని, పేదలకు సేవ చేయడం దేవుడికి సేవ చేయడంతో సమానమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. పెద్ద నోట్లను రద్దు చేయటం పేదల జీవితాలను మెరుగుపరిచే దిశలో ప్రయోగించిన దీర్ఘకాలిక అస్తమ్రని అన్నారు. ఇక్కడ జరుగుతున్న బిజెపి జాతీయ కార్యకవర్గ సమావేశాల్లో ఆయన శనివారం ముగింపు ఉపన్యాసం చేశారు. తనకు అధికార కాంక్ష లేదని, స్వర్గం లేదా మరోజన్మ అక్కర లేదని, పేదల కన్నీళ్లు తుడవడానికి దీర్ఘకాలం జీవించి ఉండాలని మాత్రమే కోరుకుంటున్నానని అర్థం వచ్చే ఓ సంస్కృత శ్లోకాన్ని ఉదహరించారు. ఎన్నికల సంస్కరణల అవసరాన్ని మరోసారి నొక్కి చెప్పిన మోదీ రాజకీయ పార్టీలలో ఈ విషయంపై ఏకాభిప్రాయం అవసరమన్నారు. నోట్లరద్దు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ మరింత పారదర్శకమైన శకానికి నాంది పలుకుతున్న దృష్ట్యా రాజకీయ పార్టీలకు అందే నిధులను పారదర్శకం చేయడంలో బిజెపి కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ‘రాజకీయ పార్టీల నిధులలో పారదర్శకతను తీసుకు వచ్చేందుకు బిజెపి అందరికన్నా ముందుండి పోరాడుతుంది. మనకు అందే నిధులు ఎక్కడినుంచి వస్తున్నాయో తెలుసుకునే హక్కు ప్రజలకుంది’ అని ఆయన అన్నారు. నోట్లరద్దు తర్వాత ప్రతిపక్ష పార్టీలు బిజెపి నాయకత్వంపై అవినీతి ఆరోపణలు చేయడాన్ని ఆయన ప్రస్తావిస్తూ విమర్శలను స్వాగతించాలని, అయితే ఆరోపణలకు భయపడవద్దని పార్టీ నేతలను కోరారు.ఈ సందర్భంగా తాను పేదరికంలో జీవించిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ సహా అయిదు రాష్ట్రాల్లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను ప్రస్తావిస్తూ, ఈ రాష్ట్రాలన్నిటిలోను బిజెపి విజయం సాధిస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం లక్నోలో తాను ప్రసంగించిన భారీ బహిరంగ సభ, తన నియోజకవర్గమైన వారణాసిలో కార్యకర్తలతో జరిపిన చర్చ దీనికి నిదర్శనమన్నారు. బూత్‌లపై దృష్టిపెట్టాలని పార్టీ కార్యకర్తలను కోరిన మోదీ, మీరు ఎంత ఎక్కువ కష్టపడితే పార్టీకి అంతగా ఓట్ల పంట పండుతుందన్నారు. ‘ఎన్నికల్లో పరిస్థితి మనకే అనుకూలంగా ఉంది’ అని ఆయన అన్నారు. దాదాపు 50 నిమిషాల పాటు ప్రసంగించిన ప్రధాని ప్రదానంగా పేదలగురించి, వారి సాధికారికత కోసమే తమ ప్రభుత్వం పని చేస్తున్న విషయాన్ని చెప్పుకొచ్చారు. ‘మన దేశంలోని పేదలు ఈ చరిత్రాత్మక నిర్ణయాన్ని (నోట్లరద్దు) స్వాగతించారు. అవినీతితో సహా సామాజిక రుగ్మతలను అంతమొందించే ఓ పటిష్ఠమైన చర్య ఇదని వారు భావించారు’ అని మోదీ అన్నారు. ఈ నిర్ణయం ద్వారా వచ్చిన కష్టాలను భరించడం ద్వారా ఓ గొప్ప మార్పు దిశగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని వారు స్వాగతించారని ఆయన అంటూ, గత రెండు నెలల్లో మన సమాజం శక్తి ఏమిటో దేశానికి తెలిసివచ్చిందన్నారు. కొంతమంది తమ జీవన విధానం మెరుగు గురించే ఆలోచిస్తారని, అయితే పేదల జీవితాలను మెరుగుపరచడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయన అన్నారు.
బిజెపి ఎన్నికల్లో విజయం సాధించడానికి పేదలు, పేదరికం అస్త్రాలు కాదని ప్రధాని స్పష్టం చేశారని సమావేశం వివరాలను మీడియాకు వివరించిన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని పేదల జీవితాలను మెరుగుపర్చడానికి తమ ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలను వివరించారన్నారు. కాగా, టికెట్ల పంపిణీ బాధ్యత పార్టీదని అంటూ, తమ పిల్లలకు, బంధువులకు టికెట్లు అడగవద్దని పార్టీ నేతలకు ప్రధాని హితవు చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా పార్టీ తదుపరి జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏప్రిల్ 15-16 తేదీల్లో జరుగుతాయని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.