జాతీయ వార్తలు

త్వరలోనే రాహుల్‌కు పట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 7: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని అధ్యక్షుడుగా ఎంపిక చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 11న టల్కటోరాలో ఏర్పాటు చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో రాహుల్ గాంధీని కాంగ్రెస్ అధ్యక్షుడుగా నియమించాలనే తీర్మానాన్ని ఆమోదించే అవకాశాలున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ అధినాయకత్వం జనవరి 11న ఢిల్లీలోని టల్కటోరా స్టేడియంలో పార్టీకి చెందిన అన్ని రకాల నాయకులతో ఒక విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ఒక రోజుపాటు జరిగే ఈ సమావేశానికి ఏఐసిసి డెలిగేట్లు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, పిసిసి అధ్యక్షులు, డిసిసి అధ్యక్షులు, మండల, గ్రామస్థాయి పార్టీ కమిటీల అధ్యక్షులు, వివిధ అనుబంధ సంస్థల అధ్యక్షులు, పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులను ఆహ్వానించారు. దేశ రాజకీయాల గురించి చర్చించేందుకు ఏర్పాటు చేసినట్లు చెబుతున్న ఈ కీలక సమావేశంలో పెద్దనోట్లను రద్దు చేయటం వలన ఉత్పన్నమైన పరిస్థితులు, వీటిని ఎదుర్కొనేందుకు పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, కాంగ్రెస్‌ను పటిష్టం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశంలపై చర్చించే అవకాశాలున్నాయి. కాంగ్రెస్‌ను మరింత పటిష్టం చేసేందుకు రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడుగా వెంటనే నియమించాలని పలువురు సీనియర్, జూనియర్ నాయకులు ఈ సమావేశంలో డిమాండ్ చేయనున్నారు. ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించి అధ్యక్షురాలు సోనియా గాంధీకి అందజేస్తారని తెలిసింది. అనంతరం జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలోనే రాహుల్‌ను కాంగ్రెస్ అధ్యక్షుడుగా నియమించవచ్చునని చెబుతున్నారు. ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలకు ముందే రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడుగా నియమించటం వలన రాజకీయంగా కలిసి వస్తుందనే వాదన వినిపిస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తరచు అనారోగ్యానికి గురవుతున్నందున రాహుల్‌ను వీలున్నంత త్వరగా పార్టీ అధ్యక్షుడుగా నియమించుకోవటం మంచిదని పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇరువురు కూడా ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లు తెలిసింది. జనవరి 11వ తేదీ సమావేశంకోసం ఒకటి, రెండు రోజుల్లో స్వదేశానికి తిరిగి వస్తున్నట్లు చెబుతున్నారు.