జాతీయ వార్తలు

పార్లమెంటు క్యాంటీన్లలో రాయతీలు తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 1: భారత పార్లమెంటులోని క్యాంటీన్లలో ఎంపీలు, విలేఖరులు, ఇతర ప్రముఖులకు ఇంత కాలం లభించిన రెండు కోట్ల అరవై మూడు లక్షల రాయితీకి కోత పడింది. పార్లమెంటు క్యాంటీన్లలోని ఆహార పదార్థాల రేట్లను 60 నుంచి 70 శాతానికి పెంచారు. పెంచిన రేట్లు వెంటనే అమలవుతాయని అధికార వర్గాలు వెల్లడించాయి. పార్లమెంటులోని సెంట్రల్ హాల్‌తో పాటు అతిథుల కేంద్రం, పార్లమెంటు గ్రంథాలయం, పార్లమెంటు ప్రాంగణంలో దాదాపు పది క్యాంటీన్లు ఉన్నాయి. ఈ క్యాంటీన్లలో రాయితీ ధరలకు రక రకాల ఆహార పదార్థాలను ఎంపీలు, మంత్రులు, విలేఖరులు, ఇతర ప్రముఖులకు విక్రయిస్తారు. దేశంలోనే అత్యంత తక్కువ ధరలకు ఆహార పదార్థాలను పార్లమెంటు క్యాంటీన్లలో విక్రయిస్తారు. ఎంపీలకు అతి తక్కువ రేట్లకు ఆహార పదార్థాలతో పాటు పాలు, నెయ్యి, టీ పౌడర్, కాఫీ పౌడర్ విక్రయించటంపై మాధ్యమాల్లో తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమైంది. రెండు రూపాయలకు ప్లేటు వడ, ఒక రూపాయికి టీ, కాఫీ, 30 రూపాయలకు చికెన్ బిర్యానీ, 18 రూపాయలకు విజిటేరియన్ భోజనం, 32 రూపాయలకు తండూరీ చికెన్ అమ్మడంపై విమర్శలు వెల్లువెత్తాయి. పార్లమెంటు క్యాంటీన్లలో ఎంపీలకు రాయితీ రేట్లకు ఆహార పదార్థాలు విక్రయించటం వల్ల సాలీన ప్రభుత్వంపై రెండు కోట్ల అరవై మూడు లక్షల రూపాయల భారం పడేది. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పరిస్థితిని సమీక్షించిన అనంతరం రాయితీని తొలగించాలనే నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. దేశంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో పార్లమెంటులో ప్రజాప్రతినిధులకు ఎక్కువ రాయితీలతో ఆహార పదార్థాలను విక్రయించటం పట్ల ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో రేట్లను పెంచాల్సి వచ్చిందని తెలిసింది. పార్లమెంటు క్యాంటీన్లను ఇకమీదట నో ప్రాఫిట్, నో లాస్ పద్ధతిలో నిర్వహిస్తామని పార్లమెంటు ఆహార కమిటీ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి తెలిపారు. కాగా పార్లమెంటులోని ప్రతి ఫ్లోర్‌లో టీ, కాఫీ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. టీ, కాఫీకి కప్పుకు ఒక రూపాయి కాకుండా పది రూపాయలకు సరఫరా చేస్తారని జితేందర్‌రెడ్డి చెప్పారు. క్యాంటీన్లలో సరఫరా చేసే ఆహార పదార్థాల సంఖ్యను కూడా తగ్గించారు. ఇప్పటి వరకూ 120 రకాల ఆహార పదార్థాలను సరఫరా చేసే వారు. అయితే ఇక మీదట కేవలం 45 రకాల ఆహార పదార్థాలు మాత్రమే ఎంపీలకు అందుబాటులో ఉంటాయి. ఈ నలభై ఐదు రకాలు కూడా ప్రతిరోజు లభించవు. వీటిని ప్రతి రోజు రొటేట్ చేయటం ద్వారా ప్రతి రోజు ఇరవై ఐదు రకాల ఆహార పదార్థాలు మాత్రమే పార్లమెంటు క్యాంటీన్లు, సెంట్రల్ హాల్‌లో సరఫరా చేస్తారు. అలాగే రూం సర్వీస్ పద్ధతిని రద్దు చేశారు.