జాతీయ వార్తలు

రాజకీయాల్లో నల్లధనానికీ చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, జనవరి 10: నోట్ల రద్దుద్వారా నల్లధనంపై చావుదెబ్బ కొట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బిజెపి రాజకీయాల్లో నల్లధాన్ని తుడిచిపెట్టడానికి, ఎన్నికల సంస్కరణలను తీసుకురావడానికి ఉద్యమాన్ని ప్రారంభించిందని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. నోట్ల రద్దుద్వారా నల్లధనంపై దాడి చేసిన తర్వాత కొంతమంది మేధావులు నిపుణులు మోదీని ఎన్నికల సంస్కరణలు తీసుకురావడం గురించి, రాజకీయ జీవితంలో సచ్చీలతను తీసుకురావడం గురించి, రాజకీయాల్లోంచి నల్లధనాన్ని తుడిచివేయడం గురించి ఏం చేయబోతున్నారని అడిగారని అమిత్ షా అంటూ, నరేంద్ర మోదీ నాయకత్వంలో బిజెపి ఈ మూడింటిపైనా చర్యలు తీసుకోవడం ప్రారంభించందని తెలియజేస్తున్నానని చెప్పారు.
మంగళవారం ఇక్కడ జనసంఘ్ వ్యవస్థాపకుడు, బిజెపి సిద్ధాంతకర్తల్లో ప్రముఖుడు అయిన దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్‌పై రాసిన ఒక పుస్తకాన్ని విడుదల చేసిన అనంతరం షా మాట్లాడారు. నల్లధనంపై పోరుగా వెయ్యి, 500 రూపాయల నోట్లను రద్దు చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని ఆయన ప్రశంసిస్తూ, దీనివల్ల దేశంలోని 80 కోట్ల పేదల సంక్షేమానికి మార్గం సుగమం అయిందన్నారు. నగదు చోరీని అడ్డుకోవడం ద్వారా పేదల సంక్షేమం కోసం బడ్జెట్‌లో కేటాయింపులను గణనీయంగా పెంచవచ్చని చెప్పారు. నోట్ల రద్దు తర్వాత ప్రకటించిన సంక్షేమ పథకాలు పేదల సాధికారికతకు ఒక వేదికను అందించనున్నాయన్నారు. తక్కువ ఖర్చు ఎన్నికలను ఎలా సాధించాలి, రాజకీయ విరాళాలను పారదర్శకం ఎలా చేయవచ్చో సూచించడానికి బిజెపి ఇప్పటికే ఒక బృందాన్ని ఏర్పాటు చేసిందని అమిత్ షా చెప్పారు. బిహార్‌లో ఒక రోజు పర్యటనకోసం వచ్చిన అమిత్‌షా సిక్కుల పదవ గురువయిన గురుగోబింద్ సింగ్ 350వ జయంతి సందర్భంగా తక్త్ హర్మిందర్ సాహిబ్‌ను సందర్శించి ప్రార్థనలు జరిపారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్‌కు అమిత్ షా ఘనంగా నివాళులర్పిస్తూ, ఆయన కారణంగానే పది మందితో ప్రారంభమైన జనసంఘ్ ఇప్పుడు 11 కోట్ల మంది సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందన్నారు.