అంతర్జాతీయం

అల్లుడా.. మజాకా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 10: అమెరికా నూతన అధ్యక్షుడిగా త్వరలో పదవీ భాద్యతలు స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్ తన అల్లుడు జారెడ్ కష్నర్‌కు కీలక పదవిని కట్టబెట్టారు. శే్వతసౌధం సీనియర్ సలహాదారుగా ఆయనను నియమించారు. దీంతో 35 ఏళ్ల కష్నర్ వైట్‌హౌస్ టీమ్‌లో అత్యంత శక్తిమంతమైన వ్యక్తికానున్నారు. మధ్యపాచ్య వ్యవహారాల్లో, వ్యాపార అంశాల్లో, దేశ, విదేశీ వ్యవహారాల్లో ఆయన కీలకవ్యక్తిగా మారనున్నారు. ట్రంప్ కుమార్తె ఇవాంక భర్త అయిన 35 ఏళ్ల కష్నర్‌పై ఎన్నికల నాటినుంచి ట్రంప్ ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇటీవల జరిగిన క్యాబినెట్ ఎంపిక సమావేశాల్లోను, అలాగే బ్రిష్ విదేశాంగ మంత్రితో జరిగిన సమావేశంలోను ట్రంప్‌కు ఆయన చేదోడుగా నిలిచారు. ఇవాంక కూడా ట్రంప్ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే కష్నర్ నియామకం వివాదాలకు తావిచ్చేదిగా ఉంది. అమెరికా చట్టాల్లో ఒక కీలక అంశం ఉంది. 1965 నాటి చట్ట ప్రకారం అధ్యక్షుడిగా ఎన్నికయిన వారు తమ కుటుంబ సభ్యుల్లో ఎవరిని కూడా కీలక పదవుల్లో నియమించుకోరాదనే నిషేధం ఉంది. అయితే కష్నర్‌కు ఈ నిషేధం వర్తించదని ట్రంప్ సన్నిహిత వర్గాలు అంటున్నాయి. అంతేకాదు కష్నర్‌కు మద్దతుగా ట్రంప్ ఒక ప్రకటన కూడా చేశారు. కష్నర్ తన బృందంలో వెలకట్టలేని వ్యక్తి అని పేర్కొన్నారు. కాగా, కష్నర్ ఇప్పటికే ట్రంప్ రియల్ ఎస్టేట్ కంపెనీల సిఈఓ పదవికి, ‘అబ్జర్వర్’ పత్రిక పబ్లిషర్ పదవికి, ఇతర సంస్థల్లో పదవులకు రాజీనామా చేశారు. ఇవాంక కూడా ట్రంప్ సంస్థలనుంచి తన సొంత ఫ్యాషన్ బ్రాండ్ బిజినెస్‌నుంచి వైదొలిగారు. అయితే డెమోక్రటిక్ పార్టీ నేతలు మాత్రం కష్నర్ నియామకాన్ని పునస్సమీక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.