అంతర్జాతీయం

‘ప్రెసిడెంట్ ఆఫ్ ప్లేలిస్ట్స్’ బరాక్ ఒబామా కొత్త ఉద్యోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 10: మరో పది రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవి నుంచి వైదొలగనున్న బరాక్ ఒబామా నిరుద్యోగిగా ఉండాల్సిన అవసరం లేదు. జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ కొత్త అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన అనంతరం వైట్‌హౌస్‌ను విడిచిపెట్టిన తరువాత ఒబామాకు కనీసం ఒక ఉద్యోగమైతే గ్యారంటీగా దొరికేట్లు కనిపిస్తోంది. ప్రముఖ మ్యూజిక్ కంపెనీ స్పూటిఫైనుంచి ఆఫర్ వస్తుందని ఆశిస్తున్నట్లు ఇటీవలే ఒబామా జోక్ చేశారు. ఇప్పుడు అదే నిజమయ్యేట్లు కనిపిస్తోంది. స్పూటిఫై కంపెనీ తన కెరీర్స్ పేజీలో ప్రసిడెంట్ ఆఫ్ ప్లేలిస్ట్స్ పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన చేసింది. ఈ ఉద్యోగానికి ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన దేశాన్ని కనీసం ఎనిమిది సంవత్సరాలు నడిపించిన అనుభవం ఉండాలంటూ నర్మగర్భంగా సూచించింది.
అంతేకాకుండా నోబెల్‌శాంతి బహుమతి కూడా అవసరమని పేర్కొంది. 2009లో ఒబామా నోబెల్ శాంతి బహుమతిని గెల్చుకున్న సంగతి తెలిసిందే. కళాకారులు, సంగీత దర్శకులతో విస్తృతంగా పరిచయాలు ఉండాలని కూడా స్పూటిఫై తన ఉద్యోగ ప్రకటనలో తెలిపింది. విలేఖరుల సమావేశాల్లో, ఇతర కార్యక్రమాల్లో ప్లేలిస్ట్‌ల గురించి అద్భుతంగా మాట్లాడగలిగే ప్రతిభ కలిగి ఉండాలని తెలిపారు. బరాక్ ఒబామాను దృష్టిలో ఉంచుకునే ఈ ఉద్యోగాన్ని, దానికి అర్హతలను రూపొందించినట్లు స్పష్టమవుతోంది. అన్ని సందర్భాల్లో అద్భుతంగా ప్రసంగాలు చేసిన వ్యక్తి గురించి చెప్పాల్సిన పని లేదని స్పూటిఫై సీఈఓ డేనియల్ ఎక్ ట్వీట్ చేశారు.